చంద్రబాబుకు నిద్రపట్టకుండా చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే..?

Chakravarthi Kalyan

ఆయనో సింపుల్ ఎమ్మెల్యే.. కానీ చంద్రబాబు నిద్ర పట్టడం లేదు. అసలే అధికారం చేజారి ఆత్మరక్షణ ధోరణిలో ఉన్న చంద్రబాబుకు ఇప్పుడు మరింతగా చుక్కలు చూపిస్తున్నాడు. ఆయనే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. మంగళగిరి ఎమ్మెల్యే. ఇంతకీ ఆయన ఏం చేస్తున్నాడు.. ఎందుకు చంద్రబాబు అంతగా నిద్రపట్టని పరిస్థితి ఏర్పడింది.. అందుకు కారణం నోటుకు ఓటు కేసు..

 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసుపై సుప్రీం కోర్టులో మరోసారి పిటీషన్‌ దాఖలైంది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓటుకు కోట్ల కేసుపై మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఎర్లీ హియరింగ్‌ పిటీషన్‌ దాఖలు చేశారు. 2017లో పిటీషన్‌ దాఖలు చేసినా కోర్టులో లిస్టింగ్‌ కాకపోవడంతో మరోసారి ఎమ్మెల్యే ఆర్కే పిటీషన్‌ దాఖలు చేశారు.

 

చంద్రబాబు రాజకీయ జీవితంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితి ఈ ఓటు కు నోటు కేసు ద్వారా వచ్చింది. ఏపీ, తెలంగాణ విడిపోయిన తర్వాత కూడా తెలంగాణలో చక్రం తిప్పుదామని ప్రయత్నించిన చంద్రబాబు అనవసరంగా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో జోక్యం చేసుకుని తలబొప్పి కట్టించుకున్నాడు. ఆంగ్లో ఇండియన్ కోటాలో ఉన్న ఒక ఎమ్మెల్యే ఓటు కొనుగోలు కోసం ప్రయత్నించి అతి పెద్ద రాజకీయ మూల్యం చెల్లించుకున్నారు.

 

ఈ కేసు కారణంగానే చంద్రబాబు.. అప్పటికప్పుడు హైదరాబాద్ ను ఖాళీ చేసిన విజయవాడకు పరుగుతీశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తారు. ఈ కేసు అప్పట్లో పెను సంచలనమే సృష్టించింది. అటు కేసీఆర్.. ఇటు చంద్రబాబు సవాళ్లు విసురుకున్నారు. పోటాపోటీ కేసులు పెట్టుకున్నారు. చివరకు రాజీకి వచ్చి చంద్రబాబు అమరావతి బాట పట్టారు.

 

అయినా ఇంకా చంద్రబాబు మెడపై ఆ ఓటు కు నోటు కేసు రూపంలో కత్తి వేలాడుతూనే ఉంది. దీన్ని వాడుకుందామని వైసీపీ ప్రయత్నిస్తోంది. గతంలోనే దీనిపై ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ అది హియరింగ్ కు వస్తుండకపోవడంతో ఇప్పుడు మళ్లీ పిటీషన్ దాఖలు చేశారు. ఈసారి విచారణ మొదలైతే.. చంద్రబాబుకు కష్టాలు తప్పకపోవచ్చేమో.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: