వారి వల్లే నేను సీఎం అయ్యాను... వారికీ మంత్రి పదవులు పక్కా.?

praveen

గతంలో కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత... కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు బిజెపి భారీ మెజారిటీ స్థానాల్లో గెలిచింది. అయినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుకు సరిపడేంత అసెంబ్లీ స్థానాలను  మాత్రం బిజెపి గెలవలేక పోయింది. ఈ క్రమంలో బిజెపి కి వేరే పార్టీ పొత్తు అవసరమైంది. అప్పటికి ముందు జాగ్రత్త పడిన కాంగ్రెస్ పార్టీ జేడీఎస్  తో పొత్తు ఏర్పాటు చేసుకుంది. జేడీఎస్  అభ్యర్థికి సీఎం సీటూ  కేటాయించేందుకు కాంగ్రెస్ జెడిఎస్ తో పొత్తు  ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ జిడిఎస్ కూటమి కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా జెడిఎస్ అభ్యర్థి కుమారస్వామి ప్రమాణ స్వీకరం చేశారు. అయినప్పటికీ బిజెపి పార్టీ మాత్రం సీఎం సీటుపై ఆశలు వదులుకోలేదు. 

 

 

 

 బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమ పార్టీ కి స్వల్ప తేడానే ఉండటంతో... ఎలాగైనా  ఏర్పాటైన ప్రభుత్వాన్ని కూల్చేసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కసరత్తులు చేసింది . ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ ఆకర్ష్  చేపట్టింది బీజేపీ పార్టీ. చాలామంది జేడీఎస్  ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు ఎన్నో కసరత్తులు చేసింది . ఈ క్రమంలో కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అటు కాంగ్రెస్ ఇటు కుమారస్వామి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ బిజెపి కొంత మంది ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకుంది. కర్ణాటకలో 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఒకేసారి 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కర్ణాటక రాజకీయాల్లో సంచలనం రేపింది. కుమారస్వామి ప్రభుత్వానికి సరైన ఎమ్మెల్యేల సంఖ్యాబలం లేకుండా అయిపోయింది. 

 

 

 

 ఆ తర్వాత ఎన్నో నాటకీయ పరిణామాల తరువాత చివరికి బిజెపి  పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. అయితే దీనిపై తాజాగా  స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప... ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 17 మంది జిడిఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం వల్లే తాను ముఖ్యమంత్రి అయ్యాను  అంటూ ఎడ్యూరప్ప అన్నారు. ఎట్టి పరిస్థితిలో వారికి అన్యాయం చేయను  అన్నారు. వారికి న్యాయం చేస్తానని మాట ఇచ్చానని ఇచ్చిన మాటపై నిలబడి వారందరికీ మంత్రి పదవులు కట్టబెడతానని  వ్యాఖ్యానించారు. వారికి హామీ ఇచ్చినట్టుగానే రాజీనామా చేసిన ఎమ్మెల్యేలందరికీ బీజేపీ టికెట్ చెప్పినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల్లో వీరు గెలవగానే మంత్రులను చేస్తానని ప్రకటించారు ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప. కాంగ్రెస్ జేడీఎస్ పార్టీ ప్రజలకు నమ్మకం పోయింది అని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య తిరోగమనంలో కాంగ్రెస్ జేడీఎస్  పార్టీలు  వెళుతున్నారని అన్నారు. ఉప ఎన్నికల్లో వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఎడ్యూరప్ప వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: