ఇమ్రాన్ ఖాన్,చంద్రబాబు పై విరుచుకుపడ్డ విజయసాయిరెడ్డి...!!

Gowtham Rohith
ప్రజల ఆఖండ మద్దతుతో అధికారంలోకి వచ్చిన వైసీపీ పై ఓ పక్క పచ్చ టిడిపి నేతలు, మరో పక్క జనసేన నేతలు పసలేని విమర్శలతో కాలం వెళ్లదీస్తున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. గెలుపు కోసం ఎంతో కృషి చేసినా ఎందుకు ఓడిపోయామో తెలీదంటూ చంద్రబాబు, ఎన్నికల్లో అక్రమాల వల్లే వైసీపీ గెలిచిందని పవన్ ఇటీవల కామెంట్స్ చేశారు.


యజమాని, ప్యాకేజ్ ఆర్టిస్ట్ కలిసి ఒకే స్క్రిప్ట్ చదువుతున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. మరి టిడిపిలో గెలిచినా ఆ ఇరవై మూడు సీట్లలో ఆయనను ఒక స్థానంలో పార్ట్నర్ ను ఎవరు గెలిపించారు అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్ కు చేస్తున్న హెచ్చరికల మాదిరి గానే చంద్రబాబు కూడా ఊరికే పేలుతున్నారని విజయసాయిరెడ్డి అన్నారు.



ప్రజలు ఈడ్చి కొడితే ఎక్కడో పడ్డ చంద్రబాబు వార్నింగ్ లు ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు లానే ఉన్నాయంటున్నారు విజయసాయిరెడ్డి. ఊసరవెల్లి సిద్ధాంతాలతో నడిచే టిడిపి జతకట్టని పార్టీ ఫ్రంట్ అంటూ దేశంలో లేదని ఎద్దేవా చేశారు. నరేంద్ర మోదీ రెండో సారి ప్రధాని కానేకాడని జోస్యాలు చెప్పిన సిగ్గులేని పచ్చ పార్టి ఇప్పుడు బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతుందని ధ్వజమెత్తారు. మనుగడ కోసం ఎవరి కాళ్లు పట్టుకున్నా తప్పులేదనేది నారా చంద్రబాబు గారి ఫిలాసఫీ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.


ఊసరవెల్లి సిద్ధాంతాలతో నడిచే @JaiTDP దేశంలో జతకట్టని పార్టీ లేదు. ఫ్రంటూ లేదు. @narendramodi మళ్ళీ ప్రధాని కానేకాడని జోస్యాలు చెప్పిన సిగ్గు లేని పచ్చ పార్టీ ఇప్పుడు బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతోంది. మనుగడ కోసం ఎవరి కాళ్లు పట్టుకున్నా తప్పులేదనేదే @ncbn గారి ఫిలాసఫీ.

— Vijayasai Reddy V (@VSReddy_MP) September 3, 2019 పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ భారత్‌కు చేస్తున్న హెచ్చరికలు, ప్రజలు ఈడ్చి కొడితే ఎక్కడో పడిన @ncbn వార్నింగులు ఒకేలా ఉంటున్నాయి. మూడు నెలల్లోనే @AndhraPradeshCM గారు అన్నింటిలో విఫలమయ్యారంట. అర్జంటుగా కుర్చీ ఖాళీ చేయాలని గగ్గోలు పెడుతున్నాడు. @ysjagan

— Vijayasai Reddy V (@VSReddy_MP) September 3, 2019 యజమాని, ప్యాకేజీ ఆర్టిస్ట్ కలిసి ఒకే స్క్రిప్ట్ చదువుతున్నారు. ఆయనేమో ఎందుకు ఓడిపోయానో తెలియదంటాడు. రెండు చోట్ల అడ్రసు గల్లంతైన పార్టనరేమో కాలం కలిసొచ్చో, ఈవీఎంల చలవతోనే గెలిచారంటారు. ఆ 23 సీట్లలో ఆయనను, ఒక్క స్థానంలో పార్ట్‌నర్‌ను ఎవరు గెలిపించారో? @ncbn @PawanKalyan

— Vijayasai Reddy V (@VSReddy_MP) September 3, 2019



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: