పెట్టుబడుల ఆకర్షణ కోసం జగన్ భారీ ప్లాన్

Vijaya

పెట్టుబడుల ఆకర్షణ అనేది ఏపిలో పెద్ద ప్రహసనం అయిపోయింది. చంద్రబాబునాయుడు హయాంలో పెట్టుబడుల ఆకర్షణ అనే ముసుగులో ఎంత భారీగా అవినీతి జరిగిందో అందరకీ అర్ధమైపోయింది. వరుసగా నాలుగేళ్ళ పాటు  విశాఖపట్నం కేంద్రంగా దేశ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించినట్లు అప్పట్లో చంద్రబాబు, ఎల్లో మీడియా ఊదరగొట్టిన విషయం అందరికీ తెలిసిందే.

 

ప్రతీ సదస్సును చంద్రబాబు అత్యంత అట్టహాసంగా జరిపారు. నాలుగు రోజుల సదస్సుకు ఐదేళ్ళల్లో సుమారు రూ. 130 కోట్లు ఖర్చు చేశారు. అంత ఖర్చు చేసినా వచ్చిన పెట్టుబుడులు ఎన్నంటే సమాధానం లేదు. చంద్రబాబు చెప్పిన పెట్టుబడులన్నీ ఏనుగు మింగిన వెలగపండులాగ తయారైంది. కోట్ల రూపాయలు ఖర్చయిపోయింది కానీ వచ్చిన పెట్టుబడులు సున్నా.

 

రాష్ట్రంలో జనాలకు పెట్టుబడుల సదస్సంటే అదే అభిప్రాయమం నిలిచిపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం పెట్టుబుడుల సదస్సుకు కాస్త చిత్తశుద్దితోనే ప్రయత్నిస్తున్నట్లున్నారు. భారీ ఖర్చులు కాకుండా విజయవాడలోనే ఉన్న కన్వెన్షన్ సెంటర్లోనే నిర్వహిస్తున్నారు. సరే వచ్చే అతిధులకు బస, వసతి ఏర్పాట్లు ప్రభుత్వమే చేయాలి కదా ?

 

పెట్టుబుడల కోసం జగన్ దేశ విదేశాల్లో పెట్టుబుడల ప్రోత్సాహక కార్యాలయాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉంది. బెంగుళూరు, ఢిల్లీ, చెన్నై,  ముంబయ్ లాంటి నగరాలతో పాటు టోక్యో, సియోల్ లాంటి రాజధాన్నుల్లో కూడా బిజినెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని డిసైడ్ చేస్తారు. దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు ఫిక్కీ, సిఐఐ లాంటి సంస్ధల్లోని ప్రముఖులతో మాట్లాడుతున్నారు.

 

మొత్తానికి పెట్టుబడుల కోసం డ్రామాలాడకుండా నిజాయితితో ప్రయత్నిస్తే, అవసరమైన ప్రోత్సాహకాలు అందించేట్లయితే భారీ పెట్టుబడులు వచ్చే అవకాశాలు లేకపోలేదు. భారీ పరిశ్రమలు వస్తేనే యువత, నైపుణ్యం ఉన్నవారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి విజయవాడలో శుక్రవారం జరుగబోతున్న డిప్లమాటిక్ ఔట్ రీచ్ కు సుమారు 35 దేశాల నుండి ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ సదస్సు ఉద్దేశ్యాలు నెరవేరాలనే అందరూ కోరుకోవాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: