నాడు అమ్మఒడిలో బాలుడు - నేడు అమ్మఒడి ప్రదాత

Chakravarthi Kalyan

ఈ ఫోటో చూశారా.. ఎవరో గుర్తు పట్టారా.. అవును మీరు ఊహించింది కరక్టే.. ఆయనే నేటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. చిన్ననాడు చెల్లెమ్మె షర్మిలతో ఆడుకుంటూ అమ్మఒడిలో దిగిన ఫోటో ఇది. ఇలాంటి అపురూప సన్నివేశాలే బాల్యానికి తీపి గురుతులు కదా..


ఓ చెక్క కుర్చీలో జగన్ తల్లి విజయమ్మ కూర్చుంటే.. చెల్లి షర్మిల తల్లిపై వాలిపోయి అమాయకంగా ఎటో చూస్తోంది. జగన్ పూర్తిగా అమ్మపై వాలిపోయి గారంగా నిలుచుంటే..తల్లి విజయమ్మ ఫోటో గ్రాఫర్ కేసి చూస్తున్నారు.. అప్పడు క్లిక్ మన్న చిత్రం ఇప్పుడు అపురూప జ్ఞాపకమైంది.


ఎప్పుడో 30-40 ఏళ్ల నాటి చిత్రం ఇది.. కాలచక్రం గిర్రున తిరిగింది. అప్పుడు అమ్మఒడిలో గారాలుపోయిన ఆ బిడ్డ ఇప్పుడు ఏకంగా అమ్మఒడి వంటి అద్భుతమైన పథకానికి రూపశిల్పి, ప్రదాత అయ్యాడు. పేదల కన్నీరు తూడవడం.. సామాన్య ప్రజానీకం బాగోగులే అసలైన పాలన అని భావించిన తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ జనం జేజేలు అందుకుంటున్నాడు..


పేదరికం కారణంగా విద్యార్ధీ ఉన్నత చదువులకు దూరం కాకూడదని తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయంబర్స్ మెంట్ పథకం ప్రవేశపెట్టి.. ఎందరో పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారు. వారు ఉన్నత స్థాయికి ఎదిగేలా దోహద పడ్డారు. ఇప్పుడు జగన్ మరో అడుగు ముందుకేశారు.. తండ్రి ప్రవేశపెట్టిన ఫీజు రీయంబర్స్ మెంటు కొనసాగిస్తూనే.. అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టారు.


పేదరికం కారణంగా కొందరు పిల్లను బడికి పంపకుండా పనులకు పంపుతారు.. పల్లెల్లో జీతానికి ఉంచుతారు.. అలాంటి వారు బడి వైపు చూడాలంటే.. ఆ చిట్టిచేతులు కష్టపడి సంపాదించే సొమ్ము ఆ ఇంటికి చేరాలి. అందుకే జగన్ అమ్మఒడి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా తల్లి పిల్లలను బడికి పంపితే చాలు ఏడాదికి 15 వేల రూపాయలు ఇస్తారు.


ఇంత చక్కటి అవకాశం ఇస్తే ఏ తల్లిదండ్రులు మాత్రం బడికి పిల్లలను పంపరు. నిజంగా అమ్మఒడి పేదపిల్లల పాలిటి విద్యావరంగా చెప్పాలి. అందుకే ఆనాడు అమ్మఒడిలో ఆడిన ఆ బాలుడు ఇప్పుడు అమ్మఒడి ప్రదాత అయ్యాడు. గ్రేట్ కదా.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: