నరసింహన్ హార్ట్ ను టచ్ చేసిన జగన్ కామెంట్స్..?

Chakravarthi Kalyan

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా నరసింహన్ ప్రస్థానం ముగిసింది. దాదాపు 12 ఏళ్లు పని చేసిన నరసింహన్ ఇక తెలంగాణ గవర్నర్ గానే పరిమితం కానున్నారు. ఏపీకి కొత్త గవర్నర్ ను నియమించినందున నరసింహన్ కు ఏపీ సీఎం జగన్ ఘనంగా వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు.


ఈ కార్యక్రమంలో సీఎం జగన్.. నరసింహన్ సేవలను కొనియాడుతూ చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. ఏపీకి నరసింహన్ చేసిన సేవలను జగన్ గుర్తు చేసుకున్నారు. మరికొంతకాలం ఆయన కొనసాగి ఉంటే బాగుండేదని జగన్ అన్నారు. వీడ్కోలు చెప్పడం బాధగానే ఉన్నా... ఆయన మనతోటే ఉంటారన్న నమ్మకం ఉందని జగన్ అన్నారు.


ఈ వీడ్కోలు సమావేశంలో జగన్ గవర్నర్ నరసింహన్ ను తన తండ్రితో పోల్చి మాట్లాడటం ఆయన హృదయాన్ని తాకి ఉంటుంది. నరసింహన్ తన తండ్రి మాదిరి ఉన్నారంటూ జగన్ చెప్పడం ఆసక్తికలిగించింది. నాన్నగారిలా తనకు నరసింహన్ అనేక సలహాలు ఇచ్చారని జగన్ గుర్తు చేసుకున్నారు.


తాను ముఖ్యమంత్రి అయ్యాక కూడా తనను నరసింహన్ ముందుండి నడిపించారని జగన్ గుర్తు చేసుకున్నారు. ఆయన గవర్నర్ గా వెళ్లిపోయినా.. పెద్దాయన స్థానంలో ఆయన్ని ఎప్పుడూ మనసులోనే ఉంచుకుంటామన్నారు జగన్.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: