మోడీనే ఫిదా చేసిన కొచ్చి ఎయిర్ పోర్ట్


భారత ప్రధాని నమో కి విమానాశ్రయం కొత్త విషయం కాదు. ఆయన ప్రపంచంలో ఎన్నో ఎయిర్ పోర్ట్ లను చూసి ఉంటారు. ప్రధాన మంత్రిగా రికార్డు స్థాయిలో విదేశీ పర్యటనలు చేసిన చరిత్ర ఆయన  సొంతం.  పెద్ద ఎత్తున విదేశాలకు వెళ్లి భారత దౌత్య విధానానికి నిదర్శనంగా తమ వాదనను వినిపిస్తున్న ఆయన ఆయా సందర్భాల లో పలు ఎయిర్ పోర్టులను చూసి ఉంటారు.

అయితే ఆశ్చర్యకరంగా ఎక్కడా లేని విధంగా తన విదేశీ పర్యటనను ముగించు కొని కొచ్చి వచ్చి, కొచ్చిన్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయిన వెంటనే, ఆయన తన్మయానికి అంతే లేకుండా పోయింది కారణం ఆయనకు ఆ ఎయిర్ పోర్ట్ విపరీతంగా నచ్చేసింది.  ప్రధానిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన వెళ్లిన తొలి విదేశీ పర్యటన చేసి తిరిగి వచ్చి కొచ్చి ఏయిర్ పోర్ట్ లో అడుగుబెట్టిన "కోచి అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్"  నరేంద్ర మోడీ అంతలా ఫిదా చేసిన విషయం ఏమంటే ఆ ఎయిర్ పోర్ట్ మొత్తం సౌరశక్తితో నడవటం ఆయనను అద్భుతంగా ఆకర్షించింది.


ప్రపంచంలోనే సంపూర్ణంగా సౌరశక్తితో నిర్వహించబడే విమానాశ్రయంగా కొచ్చిన్ ఎయిర్ పోర్ట్ చరిత్ర పుటల్లోకి కెక్కింది. మొత్తం సౌరశక్తితో పని చేస్తున్న ఏకైక ఎయిర్ పోర్ట్ కొచ్చి మాత్రమే. ఈ నేపథ్యంలో ఆ ఎయిర్ పోర్ట్ పని తీరుకు ముగ్దుడై - విద్యుత్ వినియోగించుకునే ఏయిర్ పోర్ట్ లు వంటి అతి పెద్ద వ్యవస్థలు హరితశక్తి లేదా సౌరశక్తి వినియోగించుకుంటే పర్యావరణానికి ఎంతో మేలుజరుగుతుందని అలాగే దేశంలోని పలు స్టేడియంలకు కూడా సౌరశక్తి వినియోగించుకోవచ్చన్న సలహాను ఇచ్చారు. 

సౌరశక్తిని వినియోగించుకొని 'ఐరాస 2018 ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు’ ను సొంతం చేసుకున్న ఎయిర్ పోర్ట్ దానికి కారణమైన కొచ్చి ఇంటర్నేషనల్ ఏయిర్ పోర్ట్ డైరెక్టర్   విజే కురియన్ ను ప్రధాని అభినందించారు. సౌరశక్తితో ఎయిర్ పోర్ట్ ను ఎలా డెవలప్ చేశారో అడిగి తెలుసుకున్నారు. టెక్నాలజీ పరంగా అప్డేటెడ్ గా ఉండే నరేంద్ర మోడీ మనసును దోచుకోవటం అంటే మాటలు కాదని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: