జగన్ ని నమ్ముతాం అంటున్నఏపీ రైతాంగం..!

KSK
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం అంతట అలుముకుంది. ప్రధాన రాజకీయ పార్టీలు ప్రజలలో ఉంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం మరియు వైసీపీ పార్టీల మధ్య పోటా పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉంటే మరోపక్క జనసేన కూడా ఈసారి పోటీ చేస్తున్న క్రమంలో రాష్ట్రంలో త్రిముఖ పోటీ నెలకొంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న వివిధ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే రాష్ట్రంలో ఉన్న మెజార్టీ రైతులు ఎక్కువగా వైసీపీ అధినేత జగన్ ఇస్తున్నా హామీల పట్ల నమ్మకాన్ని కనబరుస్తున్నారు.


గత సార్వత్రిక ఎన్నికల్లో రైతు రుణమాఫీ అంటూ ఆచరణ కాని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వల్ల తామంతా మోసపోయామని కొంతమందిని రైతులు తమ బాధను వెళ్ళబుచ్చుతున్నారు. ఈ క్రమంలో రాబోతున్న ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా జగన్ ని నమ్ముతామని గెలిపించుకుంటామని ..గత ఎన్నికలలో మమ్మల్ని మోసం చేయకుండా రైతు రుణమాఫీ చేయలేను అని ముందే చెప్పి నిజాయితీ రాజకీయాలు చేస్తూ రాబోతున్న ఎన్నికల కు ఎటువంటి హామీలు నెరవేర్చ గలరో వాటిని ప్రకటిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా మాట మీద నిలబడే జగన్...తాజాగా ఇటీవల పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఇచ్చిన హామీ చాలా సంతోషం దాయకం గా ఉందని రాష్ట్ర రైతాంగం జగన్ ఇచ్చిన హామీ పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం లో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ...నాన్న‌గారు దివంగ‌త నేత వైఎస్ఆర్ రైతుల‌కు ఎంతో సేవ చేశార‌ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. ఇకపై రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు లేకుండా చూస్తానని చెప్పారు.


పొరపాటున ఓ ఒక్క రైతు అయిన మ‌రణించిన ఆ రైతు కుటుంబానికి ఆర్థిక సాయం విషయంలో తొలి సభలోనే చట్టాన్ని తెస్తామని అన్నారు. రైతులకు అండగా నిలచే ప్రభుత్వం రావాలన్న లక్ష్యం తనదని, ఈ డబ్బుపై ఎవరికీ అధికారం ఉండదని అన్నారు.   



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: