షర్మిల కేసులో ఆంధ్రా మంత్రికి లింకు..? ఇదేనా సాక్ష్యం..?

Chakravarthi Kalyan

సినీహీరో ప్రభాస్‌ తో అక్రమ సంబంధం ఉందంటూ తనపై దుష్ప్రచారం చేసిన వారిపై చర్య తీసుకోవాలంటూ వైసీపీ నాయకురాలు షర్మిల ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మరికొందరిని ప్రశ్నిస్తున్నారు.



ఇప్పుడు ఈ వివాదంలో వైసీపీ మరో కలకలం రేపింది. షర్మిలపై దుష్ప్రచారం చేసింది టీడీపీకి సంబంధించిన వ్యక్తులే అని నిరూపించేలా కొన్ని సాక్ష్యాలను విడుదల చేసింది.  ప్రకాశం జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు అనే విద్యార్థిని, నవీన్‌ అనే మరొకర్ని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.



వెంకటేశ్వర్లు తండ్రి మంత్రి సిద్ధా రాఘవరావు ముఖ్య అనుచరుడని, రెండెకరాల ప్రభుత్వ భూమిని ఆ కుటుంబానికి ఇచ్చినట్లుగా తేలిందని వైసీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ మీడియాకు తెలిపారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక వారి కుటుంబ సభ్యుల వ్యక్తిత్వాలను టీడీపీ కించపరుస్తోందని ధ్వజమెత్తారు.



షర్మిలపై దుష్ప్రచారం వెనుక టీడీపీ ఉందని తాము చెబితే తమ ఇంటావంటా ఇలాంటివి లేవని చంద్రబాబు, మహిళా మంత్రులు, ఇతర నేతలు మాట్లాడారని వాసిరెడ్డి పద్మ ఎద్దేవా చేశారు. ఇప్పుడు టీడీపీకి చెందినవారే అసభ్య కామెంట్లు పెట్టినట్లు నిరూపితమైందని దీనికి వారు ఏం సమాధానం చెబుతారని ఆమె ప్రశ్నించారు. రాజకీయాలను రాజకీయంగా చూసుకోవాలని, ఇలాంటి విష సంస్కృతిని పెంచి పోషించవద్దని, అలాంటివారిని వెనకేసుకురావద్దని టీడీపీ నేతలకు ఆమె హితవు పలికారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: