జయరామ్ హత్యకేసు నుండి శిఖా చౌదరిని తప్పించటానికి "బిగ్ డీల్" కుదిరిందా!?

పారిశ్రామికవేత్త జయరామ్ హత్యకు గురయ్యారని, ఆయన మేనకోడలు శిఖా చౌదరే ఈ కేసులో కీలక సూత్రదారి అని పోలీసులు నిర్దారణకు వచ్చారని వార్తలు వస్తున్నాయి.శిఖా చౌదరి మొబైల్ కాల్-డేటాను విశ్లేషించిన పోలీసులు ఈ అబిప్రాయానికి వచ్చారని చెబుతున్నారు. ఆమెను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారని శిఖా చౌదరితో పాటు ఆమె సోదరి మనీషా, శిఖా బాయ్‌ఫ్రెండ్‌ రాకేశ్‌ రెడ్డి స్నేహితుడు శ్రీకాంత్‌ రెడ్డిని విచారిస్తున్నారని తెలుస్తోంది.


రెండువేల కోట్ల రూపాయల వ్యాపారాలు ఉన్న చిగురుపాటి జయరాం తన ఆస్తులలో కొన్నిటిని శిఖా చౌదరి పేరిట రాశాడని, అయితే డాక్యుమెంట్లు మాత్రం తన వద్దే ఉంచుకున్నాడని అంటు న్నారు. వీటి గురించి కుటుంబం లో తరచూ గొడవలు జరిగేవట. వ్యాపార విషయాల్లో శిఖా చౌదరి జోక్యం మితిమీరటంతఒ జయరామ్‌ భార్య పద్మజ ఆగ్రహం వ్యక్తం చేశారని వాచ్‌-మన్‌ వెంకటేశ్‌ తెలిపాడు. 
హత్య జరిగిన మరుసటి రోజు అంటే, 31 వ తేదీ ఉదయం 7 గంటల ప్రాంతంలో శిఖా చౌదరి జూబ్లీహిల్స్‌ లోని జయరాం ఇంటికి వచ్చి జయరామ్‌ గది, బీరువా తాళాలు ఇవ్వాలని వాచ్‌-మన్‌ వెంకటేశ్‌తో వాదులాటకు దిగిందని అంటున్నారు. మొత్తం మీద జయరామ్ ఆస్తుల వివాదం లోనే హత్యకు గురయ్యాడని భావిస్తున్నారు.


జయరామ్‌ ను హైదరాబాద్‌ లోనే హత్య చేసినట్టు పోలీసులు ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌ లో హత్య చేశాకే, కారులో తీసుకొచ్చి నందిగామవద్ద వదిలేసి వెళ్లిపోయి నట్టు చెబుతున్నారు. అప్పటికే అతన్ని హత్య చేసి 24 గంటలు గడిచిందని పోస్ట్‌-మార్టమ్ నివేదికలో తేలినట్టు తెలుస్తోంది. హత్యకు కుక్కలను చంపే విషాన్ని ఉపయోగించినట్టు సమాచారం. పాయిజన్ ఇంజక్షన్ ఇవ్వడం వల్లే అతని శరీరం నీలంరంగులోకి మారిపోయి ఉంటుందని అనుమానిస్తున్నారు.

కోస్టల్ బ్యాంకు అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసు లో చిక్కుముడి ఇంకా వీడలేదు. ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న శిఖాచౌదరిని, కేసు నుంచి తప్పించేందుకు పెద్ద స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయన్న పుకార్లు అతు అమరావతిలో ఇటు హైదరాబాద్ లో షికార్లు చేస్తున్నాయి. శిఖాచౌదరి తమ అదుపు లో లేదని ఎస్పీ త్రిపాఠి ప్రకటించడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతుందని అంటున్నారు. ఊతమిస్తోంది. కేసు విచారణపై అత్యంత గోప్యత పాటిస్తున్న అధికారులు, శిఖా చౌదరి మీడియా కంట పడ కుండా జాగ్రత్తపడుతున్నట్టు చెబుతున్నారు.

శిఖా చౌదరిని కేసు నుంచి తప్పించేందుకు భారీ డీల్ కుదిరిందని, అందుకే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జయరామ్ సెల్‌ఫోన్ డేటాను విశ్లేషిస్తున్న పోలీసులు, చివరిసారిగా ఆయన తన భార్య తో మాట్లాడినట్టు గుర్తించారు. ఆదివారం వారు హైదరాబాద్ వస్తుండటంతో, జయరామ్ భార్యను పోలీసులు విచారించే అవకాశం ఉంది. హత్య జరిగిన రోజు ఉదయం జయరామ్ దస్పల్లా హోటల్ నుంచి బయలుదేరినట్టు పోలీసులు గుర్తించారు. ఆరోజు దాదాపు 10 గంటల పాటు ఆయన సెల్‌ఫోన్ సిగ్నల్స్ హైదరాబాద్‌లోనే ఉన్నట్టు నిర్దారించారు.


పారిశ్రామికవేత్త, ఎక్స్‌ప్రెస్ టీవీ అధినేత చిగురుపాటి జయరామ్(55) హత్యకేసు మిస్టరీ ఇంకా వీడలేదు. కేసులో నిజానిజాలను త్వరగా నిగ్గుతేల్చడం కోసం నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు పనిచేస్తున్నాయి. వ్యాపార లావాదేవీలు, కుటుంబ వివాదాలు, వివాహేతర సంబంధం కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఈ క్రమంలో జయరామ్ మేనకోడలు శిఖాచౌదరి పాత్రపై పోలీసులు అనుమానం బలపడుతోంది.

కుటుంబం కంటే శిఖా చౌదరికే జయరామ్ ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినట్టు పోలీసులు గుర్తించారు. అమెరికా నుంచి ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా.. రాత్రి ఆమె వద్దకు వెళ్లి వచ్చేవాడని శిఖా చౌదరి అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ చెబుతున్నారు. శిఖాచౌదరి జయరామ్‌ల మధ్య తలెత్తిన విభేదాలే ఆయన హత్యకు కారణమయ్యాయా? అన్న కోణంపై పోలీసులు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి నందిగామ పోలీసులు హైదరాబాద్‌లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కృష్ణా జిల్లా కంచికచర్ల పోలీస్ స్టేషన్‌కు తరలించి అక్కడ ఆమెను విచారించారు.


దాదాపు 20 గంటల పాటు ఆమెను విచారించినప్పటికీ, ఎక్కడా పొంతన లేని సమాధానాలే చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ఆమె నుంచి సమాధానాలు రాబట్టేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.జయరామ్ ప్రారంభించిన ప్రతీ బిజినెస్‌ లోనూ శిఖా చౌదరి భాగస్వామిగా ఉన్నట్టు పోలీసులు నిర్దారించారు. ఆయన నిర్వహించిన న్యూస్-చానల్‌ లోనూ ఆమె కీలక బాధ్యత లు నిర్వర్తించారు. 

సోదరి మనీషా చదువు కోసం ఇటీవలే శిఖా చౌదరి జయరామ్ నుంచి ₹1.00 కోటి తీసుకున్నట్టు తెలుస్తోంది. జయరామ్ హత్య జరిగిన రోజు రాత్రి 11 గంటలకు ఇంటి నుంచి బయలుదేరిన శిఖా చౌదరి నేరుగా ఆయన ఇంటికెళ్లారు. ఇంటి తాళాలు ఇవ్వాలని తనతో వాగ్వాదానికి దిగినట్టు జయరామ్ ఇంటి సెక్యూరిటీ చెబుతున్నారు. జయరామ్ హత్యకేసులో ఫోరెన్సిక్ నివేదిక కీలకం కానుంది. హత్య తర్వాత శరీరం నల్లగా మారడంతో, అతనిపై విష ప్రయోగం జరిగిందా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. కొట్టి హత్య చేశారా లేక విషప్రయోగం తోనే హత్య చేశారా? అన్న విషయాలు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడికానున్నాయి.


ఇంకో వెర్షన్ 

పారిశ్రామికవేత్త చిగురుపాటి  జయరామ్ హత్య కేసు కొత్త మలుపు తిరుగుతోంది. జయరామ్‌ తన మేనకోడలు శిఖాచౌదరితో అక్రమసంబంధం పెట్టుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శిఖా చౌదరి, రాకేష్ రెడ్డి  అనే మరో వ్యక్తి  కొద్దిరోజులుగా ప్రేమించు కుంటున్నారు. ఇది తెలిసిన జయరామ్, రాకేష్ రెడ్డిని పిలిపించి శిఖా చౌదరిని వదిలేస్తే ₹3.50 కోట్లు ఇస్తానని చెప్పడంతో అతడు ఒప్పదం ప్రకారం శిఖా చౌదరిని వదిలేశాడు.

అయితే ఒప్పందం ప్రకారం మూడున్నరకోట్లు ఇవ్వాల్సిన డబ్బును జయరామ్ రాకేష్ రెడ్డికు ఇవ్వలేదు. దీంతో శిఖా చౌదరి, రాకేష్ రెడ్డిలు మళ్లీ ఒక్కటయ్యారు. జయరామ్ చనిపోయిన తర్వాత అతని ఇంటికెళ్లిన శిఖా చౌదరి, వాచ్ మెన్ ను బెదిరించి ఇంటి తాళాలు తీసుకుని ఇంట్లోకి  వెళ్లింది. ఇదంతా చూస్తే, శిఖా చౌదరే  ప్రియుడు రాకేష్ రెడ్డితో కలిసి జయరామ్ ను హత్యచేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: