షాక్ : కేసీఆర్ సభకు కుర్చీలు ఖాళీ ... కారణం అదేనా...!

Prathap Kaluva

కేసీఆర్ సభకు జనాలు తండోప తండోల గా కదలి వస్తారు . అయితే కేసీఆర్ సభకు జనాలు రావడం లేదంటే ఆశ్చర్యం కలిగించే విషయమే .  అయితే హన్మకొండలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల మైదానంలో టీఆర్‌ఎస్‌ సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సభ మాత్రం జనాలు లేక వెలవెలబోయింది. సభలో సగానికి పైగా ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఇక అది మొదలు సోమవారం రాత్రి నుంచి కాంగ్రెస్‌ నేతలు కేసీఆర్‌ హన్మకొండ సభను తమకు అనుగుణంగా ప్రచారం చేసుకుంటున్నారు. 


కేసీఆర్‌ మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని అందుకు హన్మకొండ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ మైదానంలో టీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేసిన సభ నిదర్శనమని ప్రచారం చేసుకుంటున్నారు. వాస్తవానికి వరంగల్‌ తూర్పు, వరంగల్‌ పశ్చిమ, వర్ధన్నపేట నియోజకవర్గాలకు సంబంధించి టీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాటు చేశారు. మూడు నియోజకవర్గాలకు సంబంధించి లక్షా యాభైవేల మంది తరలివచ్చేలా ఏర్పాట్లు చేశారు. సభకోసం మధ్యాహ్నం మూడు గంటలకే సభా ప్రాంగణానికి ప్రజలు, టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. 

షెడ్యూల్‌ ప్రకారం కేసీఆర్‌ సభ సాయంత్రం 4.45 గంటలకు జరగాలి. అయితే అదేరోజు (నవంబర్‌ 26న) ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో స్టేషన్‌ ఘన్‌పూర్‌, పరకాల, హన్మకొండలలో సభలు ఏర్పాటు చేసారు. టీఆర్‌ఎస్‌ పరకాల సభలో ఆలస్యం కావడంతో రోడ్డు మార్గంలో కేసీఆర్‌ హన్మకొండ సభకు వచ్చారు. దాదాపు రెండున్నర గంటలు సభ ఆలస్యమైంది. దాదాపు రాత్రి 7 గంటల సమయంలో కేసీఆర్‌ వేదికపైకి చేరుకున్నారు. కానీ కేసీఆర్‌ అప్పటికే మూడు గంటలకు పైగా వేచిఉన్న ప్రజలు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు సభ జరుగుతుంతో లేదో, మరికొంత సమయం వేచిచూడలేక ఇళ్లకు తిరుగు ప్రయాణమయ్యారు. దాదాపు సగం కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. దాంతో పాటుగా సభకు హాజరుకావడం లేదని నిర్వాహకులకు కేసీఆర్‌ సమాచారం ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: