జాబితాలో పేరు లేకున్నా ఓటరుగా నమోదై ఉన్నవారు ఓటు వేయవచ్చు! ఎలా అంటే!

ఓటరు లిస్టులో మీ పేరు చేర్చలేదని ఆందోళన చెందవద్దు. అయితే జాబితాలో మీ పేరు లేకున్నా, ఓటేసే అవకాశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం కల్పించింది. అదెలా అంటే  ఓటర్ల జాబితాలో మీ పేరు లేకున్నా మీ వద్ద తగిన ఆధారాలు ఉంటే పోలింగ్ రోజున తప్పకుండా ఓటు వేయొచ్చు.

 

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ప్రకటించిన ఓటర్ల తుది జాబితాలో చాలా మంది పేర్లు కనిపించలేదు. వెరిఫికేషన్ సమయంలో ఇళ్లలో లేకపోవడం తదితర కారణాల వల్ల జాబితా నుంచి పేర్లను తొలగిస్తున్నారు.

 

అయితే, ఆ పేర్లు పూర్తిగా జాబితా నుంచి తొలగించినట్లు భావించటం పొరపాటు. ఆచూకీ లేని ఓటర్ల వివరాలను మరో ప్రత్యేక జాబితాలో పొందుపరుచుతారు. అవి ఎన్నికల అధికారుల వద్దే పదిలంగా ఉంటాయి.

 

దానికి మనమేం చేయాలంటే

*ఇందుకు ప్రత్యేకంగా ప్రమాణ పత్రం రాయాలి

*ఎన్నికల జాబితా తయారు చెసే ముందు ఎన్నికల సంఘం క్షెత్ర స్థాయిలో మన చిరునామా తదితరాలను పరీసీలిస్తారు.

*ఆసమయంలో మనం ఇంట్లో లేకపోతే – సేకరించిన వివరాల ప్రకారం “ఆబ్సెంట్ - షిఫ్తెద్ -డోర్ లాక్ (ఏ ఎస్ డి) “ రికార్డ్ చేసి ఆ లిస్ట్ ను ప్రతి పోలింగ్ కేంద్రానికి పంపుతారు.


*ఏ ఎస్ డి  జాబితాలో మన పేరు ఉందో లేదో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిని సంప్రదించాలి ఆయన వివరాలను  పరిశీలిస్తారు.

*జాబితాలో మన పేరు ఉంటే, తగిన ఆధారాలు చూపుతూ మన పేరు ఎదురుగా  అందులో సంతకం, వేలి ముద్ర వేయాలి

*ఆతరవాత మన పేరు చిరునామా తదితరాలను మౌఖికంగా చెప్పాలి – దానిని ప్రిసైడింగ్  అధికారి వీడియో రికార్డ్ చేస్తారు.

*మన వివరాలు పరిశీలించిన అధికారులు మనలను ఓటింగ్ కు అనుమతి ఇస్తారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: