పుష్ప 2 పరువు తీసిన వర్మ.. ఇడ్లీలతో పోల్చి మరీ ?

Veldandi Saikiran
సినీ ప్రేక్షకులందరూ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పుష్ప 2 సినిమా మరో కొన్ని గంటల్లోనే థియేటర్లలోకి రానుంది. దీంతో అల్లు అర్జున్ అభిమానులు తెగ సందడి చేస్తున్నారు. తమ అభిమాన హీరో సినిమా థియేటర్లలో చూడడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి టికెట్ల ధరలు భారీగా పెరిగినప్పటికీ ఏమాత్రం వెనుకడుగు వేయకుండా సినిమా చూడాలని టికెట్లు కూడా బుక్ చేసుకుంటారు. కాగా పుష్ప 2 సినిమా టికెట్లు ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.

టికెట్ ధర పెంపు విషయంలో సామాన్యులు కాస్త ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ ఈ సినిమా టికెట్ ధర పెంపు విషయంలో ఏమాత్రం ఆలోచించకుండా సినీ విశ్లేషకులు నిర్ణయాన్ని తీసుకున్నారు. దీనిని ప్రభుత్వం కూడా అమలు చేసింది. కాగా, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పుష్ప2 సినిమాపై తనదైన స్టైల్ లో ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా వర్మ.... సుబ్బారావు అనే వ్యక్తి ఒకరు ఇడ్లీ హోటల్ ను పెట్టి ఒక్కో ప్లేట్ ఇడ్లీ రేటును 1000 రూపాయలకు అమ్ముతున్నాడు.
అతడు అంత రేటు పెట్టడానికి అసలు కారణం అతను చేసినటువంటి ఇడ్లీలు మిగతా ఇడ్లీల కన్నా గొప్పవని నమ్మడమే దానికి గల ప్రధాన కారణం. ఒకవేళ వినియోగదారుడు సుబ్బారావు ఇడ్లీలు అంత విలువని అనుకోకపోతే సుబ్బారావు హోటల్ కి అసలు వెళ్ళడు. దాంతో నష్టపోయేది సుబ్బారావు ఒక్కడే తప్ప మరెవరు కాదు అంటూ వర్మ కామెంట్ చేశారు. దీంతో పుష్ప 2 టికెట్ రేట్ల పెంపు విషయంలో ఇన్ డైరెక్ట్ గా మాట్లాడారు వర్మ.

మొత్తంగా ప్రేక్షకులకు సినిమా నచ్చితేనే చూస్తారని వారికి నచ్చకపోతే ఈ సినిమా చూడరనే విషయాన్ని రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశారు. ఇక ఈ కామెంట్లు చూసిన చాలామంది రాంగోపాల్ వర్మ పుష్ప 2 సినిమా టికెట్ల ధర పెంపు విషయంపై ఇన్ డైరెక్ట్ గా ఇలా మాట్లాడాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: