చంద్రబాబు నమ్మక ద్రోహి-రాజకీయం అంటే ప్రతిపక్షాన్ని అంతం చేయటం కాదు: రోజా భర్త

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిజస్వరూపం వ్యక్తమయ్యెలాగా ప్రతిపక్ష వైసిపి శాసనసభ్యురాలు రోజా పతిదేవుడు ఆర్కె సెల్వమణి సరిగ్గా ఒకే ఒక్క మాటలో సంచలనాత్మకంగా చెప్పారు. అదేంటో చూద్ధాం: 

వైసీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా భర్త ఆర్కె సెల్వమణి, ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉండే ఆయన తొలిసారి చంద్రబాబు నాయుడిపై విమర్శలు గుప్పించారు. వైసీపీ నేడు (శనివారం) నగరి పట్నం లో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడుతూ  "కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి చంద్రబాబుకు సిగ్గు, శరం లేవు" అంటూ ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. 

ఒకప్పటి నారా చంద్రబాబు నాయుడికి, ఇప్పటి చంద్రబాబు నాయుడికి చాలా తేడా ఉందని, ఆయన పూర్తిగా నమ్మక ద్రోహి గా పరివర్తన చెందారని అన్నారు. 2004లో చంద్రబాబును ఏంతో అభిమానించానని, కానీ 2014లో ఆయన అసలు స్వరూప స్వభావం తెలిసి అసహించుకున్నానని ఆయన తెలిపారు. వైసీపీ తరుఫున గెలిచిన ఎమ్మెల్యేలకు టీడీపీ ప్రభుత్వం నరకం చూపిస్తోందని ఆయన పేర్కొన్నారు. తన శ్రీమతి రోజా ఇప్పుడు చంద్రబాబు టిడిపి పాలనలో పడుతున్న అవస్థలు దగ్గరి నుండి చూడటంతో బాబు గురించి ఆయనకంటే ఎక్కువ ఎవరికి తెలుసు? 

ఈ సందర్భంగా ప్రజలకు సేవచేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని వైసీపీ ఎమ్మెల్యే రోజా తెలిపారు. ఆ బహిరంగసభలో ఆమె మాట్లాడుతూ, రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారని అన్నారు. దొంగలు, రౌడీలు, మాత్రమే జన్మభూమి కమిటీలో సభ్యులుగా ఉన్నారని, వైసీపీ శాసనసభ్యులు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు ప్రభుత్వం సరిగా నిధులు ఇవ్వట్లేదని ఆమె మండిపడ్డారు. ఈ సందర్భంగా మై ఎమ్మెల్యే యాప్‌ ను రోజా ప్రారంభించారు. తాను చేసిన అభివృద్ధిని ఆమె ఈ యాప్‌ ద్వారా ప్రజలు అందరు తెలుసుకునేలాగా రూపొందించినట్లు రోజా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: