అంతర్జాలంలో బాబు పాత ట్వీట్లకు భలే గిరాకి! ఇంతలా నాలుక మడతెవరేస్తారు!

మాటమార్చడం మడమతిప్పడంలో ఎలాంటి అనుమానానికి,  సిగ్గుఎగ్గులకు సైతం ఆస్కారం ఇవ్వని ఆస్కార్ అవార్దుకు అర్హుడు చంద్రబాబు నాయుడు. సాధారణంగా ఏదైనా విషయంలో సరైన సాక్ష్యాలు జనం మదిలో రిజిస్టర్ ఐతే ఎవరైనా ఆ మాటమార్చి మాట్లాడటానికి సిగ్గుపడతాం! మళ్లీ మరో మాట మాట్లాడటం అంటే మనకు నరక ప్రాయం. అదే చంద్రబాబుకు కొట్టిన పిండి. అందుకే వైసిపి వాళ్ళు ఆయన్ని యూ-టర్న్ అంకుల్ అని పిలవటానికి ఏ మాత్రం సంకోచించరు.

అయితే బాబుకు అలవాటైన ఈ విద్య అంత సున్నితంగా కూడా ఉండదు. ఇలా మాట మార్చడంలో కూడా బాబు గట్టిగా, నిస్సంకోచంగా మాట్లాడుతూ ఉంటారు. మొదట ఏదైతే మాట్లాడతాడో, అందుకు వ్యతిరేకమైన మాటను కూడా తొలుత మాట్లాడినంత గట్టిగామాట్లాడతాడు. ఇలాంటి చరిత్ర బహుశ ఈ ప్రపంచంలో చంద్రబాబు నాయుణ్ణి మించిపోగలవారు ఎవరూ ఉండరని అంటుంటారు. 





గతంలో అయితే ఎలా నడిచినా మాట్లాడినా నాలుక మడతెయ్యొచ్చు. సాక్ష్యాలు పెద్దగా ఉండేవి కాదు కదా! మరి ఇది సోషల్ మీడియా యుగం కదా! అయినా కూడా బాబు మాటలు మార్చడం నాలుక మడతెయ్యటం ఆగటం లేదు. మొదట ఏదో ఒకటి ట్వీట్ పెడతాడు. అది జనం మనసులోకి చేరిన తర్వాత కూడా  అవకాశాన్ని బట్టి అందుకు విరుద్ధమైన ట్వీట్ పెడుతూ ఉంటాడు చంద్రబాబు. ఇక్కడ ఎలాంటి తడబాటూ ఆయనకు ఉండదు. ఎవరైనా ఏమంటారో అనే భయం లేదు. అబద్ధం నా జన్మహక్కు అనుకుంటారాయన.  అందుకే ఆయన మాట్లాడిన పాత ఆడియో, వీడియో క్లిప్పింగులకు, ఆయన చేసిన  పాత ట్వీట్లకు మార్కెట్ లో మాంచి డెమాండ్ ఉంది.

కింగ్ సినిమాలో బ్రహ్మానందంలాగా పాత పాటల ట్యూన్స్ కట్టి అన్నీ తనవే నని చెప్పి సన్నివేశం బాగా రక్తిగట్టించారు. అయితే నాగార్జున బృందంలోని వేణుమాధవ్ ఒరిజినల్ ట్యూన్ పాడి వినిపించగానే బ్రహ్మానందం బిత్తర చూపులతో ఇబ్బందిపడే నటన సినిమాకే హైలైట్ అయింది. కాకపోతె చంద్రబాబుకు మాత్రం బ్రహ్మానందం
లాగా సిగ్గులేదుకదా!   

ఇది వరకూ చంద్రబాబు కాంగ్రెస్ మీద విరుచుకు పడుతూ ట్వీట్లు పెట్టేవాడు. అవినీతి పార్టీలే కాంగ్రెస్ తో జత కడతాయని చంద్ర బాబుగారి ట్విట్టర్ పక్షి కూసేది.  తెరాస, వైకాపాలు కాంగ్రెస్ తో జత కలుస్తాయని కాబట్టి అవి అవినీతి పార్టీలు అని అర్ధం వచ్చెలా ట్వీట్ చేసి ప్రచారం చేస్తే ఆయన మాటల ప్రతిధ్వనులు పచ్చ మీడియా గొంతు తో విశ్వాంతరాళం దద్దరిల్లేది.

అయితే, ఇప్పుడు తనే కాంగ్రెస్ తో చేతులు కలిపి అవినీతి పరుడని ఋజువు చేసుకున్నాడు. అదే అదనుగా అంతర్జాలంలో చంద్రబాబు గారి పాత ట్వీట్ ఒకటి వైరల్ అయ్యింది.

ఇక నోట్ల రద్దు జరిగి రెండేళ్లు అయిన సందర్భంగా చంద్ర బాబు దాన్ని తప్పు పడుతూ తాజాగా ఒక అద్భుతమైన ట్వీట్ పెట్టాడు. అయితే రెండేళ్ల కిందట నోట్ల రద్దు జరిగి నప్పుడు దాన్ని చంద్ర బాబు చాలా గట్టిగా సమర్థించాడు. ఇప్పుడు అంతర్జాల సంచారులు (నెటిజన్లు) పాత ట్వీట్ ను, కొత్త ట్వీట్ ను పక్క పక్కనే పెట్టి చంద్రబాబుతో చెడుగుడు ఆడేస్తున్నారు. 




అయినా ఆయన ఎప్పుడు తనకు అవసరంలేని గత చరిత్ర గుర్తుంచుకోరుగా! అవసరమైతే వాడేస్తారు. ఏ వెరైటీ పర్సనాలిటీ ఈ గుణం చాణక్యుడు చెప్పింది కాదు. శకుని, రాక్షసమాత్యుడు వాడేసిన రాచకీయం చంద్రబాబుకు చక్కగా సరిపోయింది. అందుకే చంద్రబాబు అపర రాక్షసుడు. చాణక్యుడు మాత్రం కాదు సుమా!  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: