సంస్కారం లేని నాయకులు ప్రజలకెలా మార్గం చూపుతారో? అక్కడ గాలి-ఇక్కడ బాబు

అసలు ఈ రాజకీయ నాయకులంతా ఇంతే అనుకుంటా? నిన్న వైఎస్ జగన్మోహనరెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కాలుకూతలు ఎంతగా మానవతావాదు లను కృంగదీశాయో/ అలాగే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు రాకేశ్ మరణంపై ఖనిజ వ్యాపారి (మైనింగ్ వ్యాపారి) మాజీ మంత్రి గాలి జనార్థనరెడ్డి చేసిన వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయ వర్గాలను అంతే తీవ్ర విస్మయానికి గురిచేశాయి. 

సొంతపార్టీ బీజేపీతో కలిపి అన్ని పార్టీలకు చెందిన నేతలు గాలి జనార్ధనరెడ్డిపై మండిపడుతున్నారు. అవినీతి ఆరోపణలతో గతంలో జైలుకు వెళ్లివచ్చిన గాలి జనార్ధన రెడ్డి ఇటీవల ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సాధారణ మర్యాదలు వాటితో పాటు మానవత్వం మరచి  "సిద్ధరామయ్య నన్ను నాలుగున్నర సంవత్సరాలు చెరసాలలో మగ్గేట్లు చేశాడు. నన్నూ, నా కుటుంబానికి, నా పిల్లలకు దూరమయ్యేలా చేశాడు. అందుకే ఆ దేవుడు ఆయన కొడుకును తీసుకుళ్ళి తగిన శిక్ష వేశాడు.." అని అన్నాడు.  రెండేళ్ల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పెద్ద కుమారుడు రాకేశ్, బెల్జియంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే.
 
గాలి జనార్ధనరెడ్డి వ్యాఖ్యలపై ఇప్పుడు కర్ణాటకలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో, కర్ణాటక బీజేపీ అధినేత బీఎస్ ఎడ్యూరప్ప గాలి జనార్ధనరెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాననీ, వెంటనే ఆయన సిద్ధరామయ్యకు క్షమాపణ చెప్పాలని సూచిస్తూ స్పందించారు. "జనార్థన్ రెడ్డి వ్యాఖ్యలు ఏమాత్రం అమోద యోగ్యం కాదు. రాజకీయ ప్రత్యర్ధులపై ఎవరూ వ్యక్తిగత విమర్శలకు దిగకూడదు. జనార్ధనరెడ్డి వెంటనే సిద్ధరామయ్యకు క్షమాపణ చెప్పాలి..."అని పేర్కొన్నారు.
 
పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో గాలి జనార్ధనరెడ్డి దిగొచ్చారు. తాను క్షణిక ఆవేశం లోనే ఆ వ్యాఖ్యలు చేశాననీ, ఎవర్నీ కించపర్చే ఉద్దేశం గా బాధ పెట్టాలనే ఉద్దేశం గాని లేదంటూ చెప్పుకొచ్చారు. "సిద్ధరామయ్యను బాధపెట్టాలన్న ఉద్దేశ్యం నాకు లేదు. ఆవేశం లోనే అలా మాట్లాడాను. సిద్ధరామయ్య గురించి చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నాను. ఆయనను బాధపెట్టి ఉంటే క్షమించాలి..." అని గాలి జనార్ధనరెడ్డి క్షమాపణలు చెప్పారు. 
 
కాగా గాలి జనార్ధనరెడ్డికి కనీస సంస్కారం కూడా లేదని సిద్ధరామయ్య మండిపడ్డారు. తనపై చేసిన వ్యాఖ్యలపై ట్విటర్లో స్పందిస్తూ.. "క్షమించగలగడం మనిషికున్న మహాగుణం. కానీ నేఱ మనస్తత్వమున్న ఆయనకు కనీస సంస్కారం కూడా లేదు. రాజకీయాల్లో విమర్శలు మామూలే. అయితే కుటుంబం వరకు అవి రాకూడదు. నా కుమారుడిని తీసుకుని దేవుడే నన్ను శిక్షించాడని జనార్ధనరెడ్డి అంటున్నారు. నువ్వు (గాలి జనార్ధనరెడ్డి) చేసిన పాపాలకు నీ పిల్లల్ని శిక్షించ వద్దంటూ నేను ఆ దేవుడిని వేడుకుంటున్నాను.." అని పేర్కొన్నారు.
 
బళ్లారిలో ఈ నెల 3 న జరగనున్న లోక్‌ సభ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉగురప్ప‌పై గాలి జనార్ధనరెడ్డి అనుచరుడు బి. శ్రీరాములు సోదరి శాంత పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గాలి జనార్ధనరెడ్డి మళ్లీ తెరమీదికి వచ్చినట్టు తెలుస్తుంది. గాలి జనార్ధనరెడ్డి మాదిరిగా మన చంద్రబాబు నాయుడు కూడా జగన్ ను పొడిచింది చిన్న కత్తి తోనే అంటూ గాయం కూదా పెద్దది కాడనటం కూడా క్షమార్హం కాదు గనక ఆయనను బాబు క్షమాపణలు కోరటం కనీస ధర్మం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: