దారుణం..భర్తను ఆరు నెలల నుంచి కట్టేసి..

Edari Rama Krishna
ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో భార్యల చేతుల్లో హతులైన భర్తల కేసులు సంచలనం సృష్టిస్తున్నాయి.  క్షణికావేశంలో కొందరు..పరాయి పురుషుడి మోజులో పడి భర్తలను చంపుతున్న వైనం సమాజం తలదించుకునేలా చేశాయి.  భారత దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందీ..మహిళలపై అత్యాచారాలు, హత్యాచారాలు కొనసాగిస్తున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో కట్టుకున్న భర్తలను పర పురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకొని వారితోనే దారుణంగా చంపిస్తున్న ఘటనలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి.

తాజాగా తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం కొమరగిరిపట్నం గ్రామంలో.. ఓ భార్య.. భర్తకు బతికుండగానే నరకం చూపించింది. ఆరు నెలలుగా.. ఇంట్లో కాళ్లు, చేతులు కట్టేసి.. చిత్రహింసలకు గురిచేసింది. సఖినేటిపల్లికి చెందిన కొక్కిరిగడ్డ సత్యనారాయణకు కొమరగిరిపట్నానికి చెందిన సూర్యకుమారికి 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.   డబ్బు సంపాదించడం కోసం సత్యనారాయణ పెళ్లైన కొత్తలోనే గల్ఫ్ కి వెళ్లి కొంత కాలం క్రితం స్వగ్రామానికి వచ్చాడు. 

బాగా సంపాదించిన డబ్బుతో ఇళ్లు నిర్మించుకొని కుటుంబంతో నివాసమంటున్నాడు.  గత కొంత కాలంగా మద్యానికి బానిసైన సత్యనారాయణ ప్రవర్తనతో ఆయన భార్య విసుగెత్తిపోయింది. దాంతో  6 నెలలుగా ఇంట్లోనే తాళ్లతో కట్టేసి నిర్బంధించింది. కొంతకాలంగా సత్యనారాయణ ఫోన్ ఎత్తకపోవడంతో.. అతని తమ్ముడికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాళ్లు సీన్‌లోకి ఎంటరవడంతో.. అసలు విషయం బయటపడింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: