మాట మీద నిలబడ్డం అంటే జగన్ తరవాతనే ..

KSK
రాజకీయాలలో ఆది నుంచి ఒకే మాట మీద నిలబడుతూ రాజకీయాలలో రాణిస్తున్నారు వైసీపీ అధినేత రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్. ముందు నుంచి జగన్ రాజకీయ ప్రయాణాన్ని సరిగ్గా గమనిస్తే అర్థమవుతుంది. గతంలో తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయినప్పుడు రాష్ట్రంలో చనిపోయిన ప్రతి కుటుంబాన్ని పరామర్శిస్తానని ఓదారుస్తానని నల్లకాలువ సాక్షిగా మాట ఇచ్చారు. ఈమాట కోసం ఢిల్లీ నేతలను ఎదిరించారు అలాగే ఎన్నో అవరోధాలు అడ్డంకులు చేరసాల జీవితం ఎదురైన కేసులు ఎదురైనా దేనికి భయపడక అలాగే 2014 ఎన్నికలలో పోటీ చేశారు. ఈ క్రమంలో ఆ సందర్భంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో రైతు రుణమాఫీ విషయంలో ప్రజలను మోసం చేయకుండా చాలా నిక్కచ్చి మైన రాజకీయ నేతగా వ్యవహరించారు జగన్.


అయితే ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం అధికార దాహం కోసం రణ మాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి రైతులను నిలువునా మోసం చేశారు. ఇదొక విషయమే కాకుండా చాలా హామీల విషయాలలో రాష్ట్ర ప్రజలను మోసం చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. అంతేకాకుండా  ఇప్పుడు ప్ర‌త్యేక హూదా పై రెండు నాల్క‌ల ధోర‌ణి టీడీపీ చూపించింది.. ముందు ప్ర‌త్యేక హూదా సంజీవ‌నా అని చెప్పిన వారే ఇప్పుడు ప్ర‌త్యేక హూదా ఆంధ్రుల హ‌క్కు అంటున్నారు.. ఇక సీఎం చంద్ర‌బాబు మాట మార్చ‌డం తెలుగుదేశానికి కూడా ఇరుకున పెట్టిన అంశం.


తెలుగుదేశం పార్టీ పై ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా బీజేపీ మౌనం వ‌హించింది.. చివ‌రికి వారికి వారే ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు.. కాని 2014 ఎన్నిక‌ల స‌మ‌యం నుంచి ప్ర‌త్యేక‌హూదా ఏపీకి అవ‌సరం అని, ఏపీకి ప్ర‌త్యేక‌హూదా సాధ‌నే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం అని జ‌గ‌న్ ఓకే మాట‌పై నిల‌బ‌డ్డారు.. కాని తెలుగుదేశం ఇన్ని మాట‌లు మాట్లాడ‌టం తో రాజ‌కీయంగా హీట్ పెరిగింది.. నాలుగేళ్లుగా రెండు మాట‌లు నాలుగు సార్లు మార్చ‌డం జ‌గ‌న్ ఓకే విధంగా ముందుకు వెళ్ల‌డం అదే మాట పై నిల‌వడంతో, ఇప్పుడు అంద‌రూ ఇదే చర్చించుకుంటున్నారు.


పరిస్థితి ఎలా ఉన్నా ముందునుంచి జగన్ విలువైన రాజకీయాలకు కట్టుబడి ప్రజల తీర్పును శిరసా వహించి హుందాతనంగా గొప్ప రాజకీయ నేతగా రాణిస్తున్నారు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు...జగన్ ఇలానే భవిష్యత్తు రాజకీయాలు చేసుకుంటూ పోతే ముఖ్యమంత్రి అయితే కచ్చితంగా భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చాలా గొప్పగా చూసే రోజులు దగ్గర్లోనే ఉంటాయి అని అంటున్నారు. ప్రస్తుతం జగన్ చేస్తున్న పాదయాత్రకి రాష్ట్ర ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజా సంకల్ప పాదయాత్ర లో జగన్ ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరిస్తున్నారు కష్టాలలో బాధలో ఉన్నవారికి ధైర్యం చెబుతూ మంచి రోజులు వస్తాయని కంగారు పడకండి అంటూ నాయకుడిగా భరోసా ఇస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: