ఓట్లు కాంగ్రెస్ కు సీట్లు బిజేపివి – కర్ణాటక మాయ !

Seetha Sailaja
భారతదేశ రాజకీయలను ప్రభావితం చేస్తూ మోడీ రాహుల ప్రతిష్ఠకు పరీక్షగా మారిన కర్నాట క ఎన్నికలలో ఎక్కువ స్థానాలను గెలుచుకున్న పార్టీగా భారతీయ జనతాపార్టీ విజయం సాధించడంతో బిజేపి వర్గాలు పండుగ చేసుకుంటున్నాయి. అయితే వాస్తవానికి ఈఎన్నికలలో పోల్ అయిన ఓట్ల శాతం పరిగిణలోకి తీసుకుంటే     కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కన్నడ ఓటర్లు ఓట్ల సంఖ్యలో  కాంగ్రెస్ కే పట్టంకట్టారు.

ఈఎన్నికలలో పోల్ అయిన ఓట్లలో  కాంగ్రేస్ కు 38.0 శాతం ఓట్లు వస్తే భారతీయ జనతాపార్టీకి 36.6 శాతం వోట్లు మాత్రమే వచ్చాయి. ఇక ఈఎన్నికల ఫలితాలలో కింగ్ మేకర్ పాత్ర పోషించిన జనతాదళ్ సెక్యులర్ పార్టీకి 17.7 ఓట్లుమాత్రమే వచ్చాయి. అయితే అత్యధిక సంఖ్యలో కాంగ్రెస్ కు ఓట్లు పడినా సీట్ల విషయంలో   భారతీయ జనతా పార్టీ కంటే బాగా వెనుక పడటం షాకింగ్ న్యూస్ గా మారింది. దీనితో కన్నడ ప్రజలు రాహుల్ కు పట్టం కట్టినా విజేతగా మాత్రం భారతీయజనతా పార్టీగా మారడం కాంగ్రెస్ వర్గాలు జీర్ణించుకోలేని వాస్తవంగా మారింది. 

ప్రస్తుతం హంగ్ దిశగా అడుగులు వేస్తున్న కర్ణాటక ఎన్నికల ఫలితాలు రకరకాల ట్విస్ట్ లు ఇస్తున్న నేపధ్యంలో వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పావులు కదుపుతూ జనతాదళ్ అధినేత కుమారస్వామి గౌడను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోపెట్టి వ్యూహాత్మకంగా బిజేపి కి చెక్ పెట్టాలని కాంగ్రెస్ శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇదే ముఖ్యంత్రి పదవి ఆఫర్ ను భారతీయ జనతాపార్టీ కూడ కుమారస్వామి గౌడకు ఇస్తే ఇప్పుడు ఎవరి ఆఫర్ ను కుమారస్వామి గౌడ అంగీకరిస్తాడు అన్న విషయమై రకరకాల అంచనాలు వినిపిస్తున్నాయి. 

ఈపరిస్తుతులు ఇలా ఉండగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కర్ణాటక అసెంబ్లీ ఫలితాలపై స్పందించిన విధానం అనేక ఆలోచనలకు తావు ఇస్తోంది. ఈఎన్నికల్లో కాంగ్రెస్ జేడీఎస్ కలిసి పోటీచేసుంటే ఫలితాలు వేరేలా ఉండేవనీ ఓట్ల చీలిక వల్ల భారతీయ జనతాపార్టీ లాభ పడుతోంది అంటూ ఆమె ట్విట్ చేసారు. ఈ నేపధ్యంలో మమత బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ కు అనుకూలంగా స్పందించడం రాజకీయ పార్టీల్లో కొత్త చర్చకు దారితీసింది అని  జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఏమైనా భవిష్యత్ ప్రధానమంత్రి తానే అంటూ ఈమధ్య ప్రకటన చేసి విమర్శలు ఎదుర్కున్న రాహుల్ గాంధీకి కర్ణాటక ఫలితాలు ఒక షాక్ అనుకోవడంలో ఎటువంటి సందేహం లేదు.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: