దేశంలో జాత్యహంకార దాడులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి
ఇటీవల గుర్రంమీద తిరుగుతున్నాడని గుజరాత్ రాష్ట్రంలో ఓ దళితుడిని చెట్టుకు కట్టేసి చాలా తీవ్రంగా రాక్షసంగా ప్రవర్తించి చంపేశారు అగ్రవర్ణ కులానికి చెందిన యువకులు. దళితుల పట్ల ఎక్కువగా బిజెపి పాలిత రాష్ట్రాలలో దాడులు జరుగుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కానిస్టేబుల్ ఎంపికకు హాజరైన దళిత యువకుల పట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా ప్రవర్తించింది.
ఈ విషయం సోషల్ మీడియాలోకి రావడంతో వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రతిపక్ష పార్టీలు భారతీయ జనతా పార్టీపై మండిపడుతున్నాయి. అసలు విషయమేమిటంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన రెండువందల మంది అభ్యర్థులకు పోలీసు అధికారులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా ఎంపికైన దళిత అభ్యర్ధుల ఛాతీలపై ఎస్సీ, ఎస్టీ మిగతా అభ్యర్హుల ఛాతీలపై ఓబీసీ, జనరల్ అని రాశారు. దీంతో ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ట్విటర్లో బీజేపీ పార్టీపై మండిపడ్డారు. ఇది రాజ్యాంగంపై జరిగిన దాడి అని రాహుల్ అన్నారు. ఆర్ ఎస్ ఎస్ భావజాలం నుంచే ఇటువంటి ఆలోచన వచ్చిందన్నారు.