నటుడు శివాజిపై ఏపి డిజిపికి మాజీ మంత్రి పిర్యాదు

ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా, ఇతర విభజన హామీల అమలుపై కేంద్రం వైఖరిని టాలీవుడ్ హీరో శివాజీ తొలి నుంచీ నిరసిస్తూనే ఉన్నారు. గతం లో బీజేపీ కార్యకర్తగా ఉన్న శివాజీ, ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా బాజపాకి రాజీనామా చేశారు. తాజాగా ఆపరేషన్ ద్రవిడ, దాన్లోని భాగాలే ఐన గరుడ, రావణ, కుమార, మొదలైన ఆపరేషన్ల పేర్లతో బాజపా దక్షిణాది రాష్ట్రాలైన ఉభయ తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు & కేరళ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో పాగా వేయాలని చూస్తోందని శివాజీ చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. 


అయితే సినిమాలలో చూపినట్లు రాజకీయపార్టీలు ఇలాంటి ఆపరేషన్లు చేయించవని అమలులో అవన్నీ సాధ్యం కావని - అలాంటి కట్టుకథలని సృష్టించి ప్రజల్లో భీతి  భయబ్రాంతులు,  ఆందోళనలు రెచ్చగొట్టి, ఏదో ఒక రాజకీయ పార్టీ తన రాజకీయ విస్తృత ప్రయోజనాల సాధన కోసం నేపధ్యంలో ఉండి ఆరాచకాలు సృష్టిస్తుందని పలువురు విమర్శిస్తున్నారు.

ఎవరో చెప్పిన విషయాన్ని నటుడు శొంఠీనేని శివాజీ నమ్మి, లేదా ఇష్టపూర్వకంగాకాని రాజకీయపార్టీతో కుమ్మక్కైగాని  ఈ రకమైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి ఉంటా రని వాస్తవానికి అటువంటి ఆపరేషన్లు చేయడం సాధ్యంకాదని రాజనీతిఙ్జుడు ఉండవల్లి అరుణకుమార్, రాజకీయ ఆర్ధిక విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్, ప్రముఖ జర్నలిస్ట్ తెలకలపల్లి రవి కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు.  

ఐతే, తాజాగా నటుడు శివాజీ చేసిన అభ్యంతరకరంగా భావిస్తున్న ఆరోపణలను బీజేపీ నేత ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి పైడికొండల మాణిక్యాలరావు తీవ్రంగా ఆక్షేపించారు. శివాజీ చేసిన వ్యాఖ్యలు - ఆపరేషన్ ద్రవిడ పేరుతో శివాజీ విడుదల చేసిన వీడియోను పరిశీలించి అభ్యంతరకరంగా ఉన్న అతడి వ్యాఖ్యల కారణంగా కేసునమోదు చేయా లని కోరుతూ, ఆంధ్రప్రదేశ్ డీజీపీ మాలకొండయ్యను మాణిక్యాలరావు అభ్యర్ధించారు. 


అటువంటి అభ్యంతరకరమైన వీడియోను విడుదల చేసిన నటుడు శివాజీపై చర్యలు తీసుకోవాలని అతడిపై కేసు నమోదుచేయాలని ఆయన డీజీపీని కోరారు. ఆపరేషన్ ద్రవిడ వీడియోపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీ మాలకొండయ్యకు మాణిక్యాలరావు వినతిపత్రం ఇచ్చారు.

ఆపరేషన్‌ ద్రవిడ పేరిట ఇటీవల బీజేపీపై పలు ఆరోపణలు చేసిన సినీ నటుడు శివాజీపై ఆ పార్టీ నేతలు ఆదివారం పోలీసు లకు ఫిర్యాదు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై శివాజీ అనుచిత వ్యాఖ్యలు చేశారని నగరంలోని సూర్యారావు పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించారు.

ప్రధాని మోదీపై శివాజీ అమానుష వ్యాఖ్యలు చేశారని, మోదీని "ఇడియట్" అని దూషించడంతోపాటు.. ఆయన ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలను చేశారని నగర బీజేపీ నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. శివాజీపై కేసు నమోదు చేసి కఠినం గా శిక్షించాలని పోలీసులను కోరినట్టు వారు మీడియాకు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: