జనసేన గెలిచే సీట్లు అన్నేనా? నేతలకు నమ్మకం లేదా?

Purushottham Vinay
•షాకింగ్ గా మారిన జనసేన ఇంటర్నల్ పాలిటిక్స్
•పోటీ చేసిందే తక్కువ సీట్లలో.. అందులో గెలిచేది సగమే అంటున్న నేతలు

జనసేన పార్టీ ఏర్పడ్డాక రెండు సార్లు మాత్రమే ఎన్నికలలో పోటీ పడింది. 2014 ఎన్నికల్లో జనసేన ఉన్నా కానీ పోటీ చేయలేదు. అప్పుడు కూడా పోటీ చేయకుండా మద్దతివ్వడంతో ఆ ప్రభుత్వంలో జనసేన భాగస్వామ్యం లేకుండా పోయింది. 2019 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీలతో విభేదించి సొంత కూటమిని ఏర్పాటు చేసుకుని వెళ్లడంతో పవన్ కల్యాణ్ తో పాటు అందరూ కూడా దారుణంగా ఓటమి పాలయ్యారు. కేవలం ఒకే ఒక్క రాజోలు నుంచి మాత్రమే ఒకే ఒక్కరు గెలిచారు. అయితే ఈసారి టీడీపీ, బీజేపీతో కలిసి కూటమిగా మరోసారి పోటీకి దిగింది.అయితే సోషల్ మీడియాలో ఫుల్ పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకున్న పవన్ కళ్యాణ్.. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం మాత్రం చాలా మందికి నచ్చలేదు. పైగా టీడీపీతో కలిసి పోటీ చేసినా జనసేన కేవలం 21 అసెంబ్లీ స్థానాల్లోనూ, రెండు పార్లమెంటు స్థానాల్లో మాత్రమే బరిలోకి దిగడం చాలా మందికి నచ్చలేదు. అయితే తక్కువ సీట్లైనా మొత్తం 21 సీట్లు రావచ్చన్న అంచనాలు ఆ పార్టీ ఫ్యాన్స్ లో ఉన్నాయి. కానీ ఆ పార్టీ నేతలకి మాత్రం అంత నమ్మకం లేకుండా పోయింది. కేవలం పది స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంటామని జనసేన పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు తెలిపారు. అంటే సగానికి సగం స్థానాల్లో జనసేన అభ్యర్థులు గెలిచే అవకాశాలున్నాయని తమ ఇంటర్నల్ పాలిటిక్స్ ద్వారా ఇండియా హెరాల్డ్ కి సమాచారం తెలిసింది.

పైగా వారిలో కేవలం ముఖ్యమైన నేతలు మాత్రమే విజయం బాట పడతారని ఇండియా హెరాల్డ్ చేసిన సర్వేల్లో తెలిసింది. రాయలసీమ చాలా కష్టం. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో కేవలం కొన్ని సీట్లు మాత్రమే తెచ్చుకునే అవకాశాలున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో వాళ్లు ఆశించిన మెజారిటీ రాకపోవచ్చని తెలుస్తుంది. ఎందుకంటే వంగా గీత గట్టి పోటీ ఇవ్వడంతో తాము తొలి నుంచి చెప్పిన మెజారిటీ తగ్గే అవకాశాలున్నాయని సమాచారం తెలుస్తుంది. అయితే పవన్ కల్యాణ్ విజయం ఖాయమని ఆయన ఫ్యాన్స్ అనుకుంటుంటే పార్టీ నేతల్లో మాత్రం కొంచెం భయం ఉంది.పిఠాపురం శాసనసభ్యుడిగా పవన్ శాసనసభలోకి సగర్వంగా అడుగు పెడతారని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నా కానీ సొంత పార్టీ నేతల్లో కొందరికి మాత్రం అంత నమ్మకం లేనట్టు సమాచారం తెలుస్తుంది.కొంతమంది మాత్రం ఖచ్చితంగా గెలుస్తారాని నమ్మకంగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: