రాజా సాబ్ కోసం భారీ సెట్.. ప్రభాస్ కాన్సన్ట్రేషన్ అంతా ఈ మూవీపై పెట్టనున్నాడా..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ కొన్ని రోజుల క్రితమే సాలార్ పార్ట్ 1 మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బాహుబలి సిరీస్ మూవీ లతో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్ ఆ తర్వాత సాహో , రదే శ్యామ్ సినిమాలతో వరుసగా ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహపరచాడు. ఇక అలాంటి వరస అపజయాల తర్వాత ప్రభాస్ హీరోగా రూపొందిన సలార్ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకొని భారీ కలక్షన్ లను వసూలు చేసింది. మొత్తం రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ మూవీ యొక్క రెండవ భాగం షూటింగ్ మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ కాబోతోంది.

ఈ సినిమా రెండవ భాగంపై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 ఏడి సినిమా కూడా విడుదలకు రెడీ అయింది. ఈ మూవీ షూటింగ్ కూడా ఇప్పటికే ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. దానితో ప్రభాస్ తన ఫుల్ కాన్సన్ట్రేషన్ ను మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ మూవీ పై పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ నుండి మేకర్స్ ప్రభాస్ కు సంబంధించిన ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ను మినహాయిస్తే ఎలాంటి అప్డేట్ లను ఇవ్వలేదు. ఇక అప్డేట్ల గురించి ఈ మూవీ బృందం కూడా ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలు అన్ని విడుదల అయిన తర్వాతే ఈ మూవీ నుండి అప్డేట్స్ వస్తాయి అని క్లియర్ గా చెప్పుకొచ్చారు.

ఇకపోతే ఈ మూవీ కి సంబంధించిన ఓ భారీ షెడ్యూల్ షూటింగ్ మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ వారు అజీజ్ నగర్ లో ఓ భారీ సెట్ ను వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్ లో ఈ మూవీ యూనిట్ చాలా రోజుల పాటు షూటింగ్ చేయనున్నట్లు సమాచారం. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ , మాళవిక మోహన్ , రీద్దీ కుమార్ లు హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... సంజయ్ దత్ ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: