గుజరాత్ పీఠం మళ్లీ బీజేపీదే..!! హిమాచలమూ కమలానిదే..!! రాహుల్ కు మళ్లీ నిరాశే..!!

Vasishta

ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గుజరాత్ ఎన్నికల్లో ప్రజలు మళ్లీ బీజేపీకే పట్టం కట్టబోతున్నట్టు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. జాతీయ ఛానళ్లన్నీ బీజేపీదే అధికారమని తేల్చిచెప్పాయి. దీంతో గుజరాత్ లో మరోసారి అధికారంలోకి రాబోతోంది కమలం.

 

గుజరాత్ లో 22 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. అయితే ఈసారి మాత్రం ఓటమి తప్పదని చాలామంది అంచనా వేశారు. వాణిజ్యరాష్ట్రంగా పేరొందిన గుజరాత్ పైన పెద్దనోట్ల రద్దు, జీఎస్టీల ప్రభావం పెద్ద ఎత్తున ఉందని.. దీంతో బీజేపీ ఓటమి తప్పదని అందరూ ఊహించారు. అయితే.. అంత సీన్ లేనేలేదని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి.  

 

ప్రధాని మోదీ కూడా ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే సుమారు 40 సభల్లో స్వయంగా మోదీ పార్టిసిపేట్ చేశారు. దీన్నిబట్టి మోదీ ఎంత భయపడ్డారో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఎలాగైనా బీజేపీని దెబ్బకొట్టాలని రాహుల్ నేతృత్వంలో చాలా కష్టపడింది. అయితే ఆ పార్టీ నేతలు చేసిన కొన్ని తప్పిదాలు బీజేపీకి వరంగా మారాయి. దీంతో.. మరోసారి కాంగ్రెస్ కు నిరాశే ఎదురయ్యే పరిస్థితి ఏర్పడింది.

 

జాతీయ ఛానళ్ల ఎగ్జిట్ పోల్స్ ను ఓసారి పరిశీలిస్తే....

మొత్తం స్థానాలు – 182

 రిపబ్లిక్‌ - జన్ కీ బాత్: బీజేపీ 108, కాంగ్రెస్‌ 74

టైమ్స్‌ నౌ - వీఎంఆర్‌ : బీజేపీ 109, కాంగ్రెస్‌ 70, ఇతరులు 3 

సీఎన్‌ఎన్‌- ఐబీఎన్‌ : బీజేపీ 109, కాంగ్రెస్‌ 70, ఇతరులు 3 
ఏబీపీ- సీఎస్‌డీఎస్‌: బీజేపీ 91- 99, కాంగ్రెస్‌ 78-86, ఇతరులు 8-7 


హిమాచల్ ప్రదేశ్ లో కూడా బీజేపీకే పట్టం కట్టబోతున్నట్టు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.
మొత్తం స్థానాలు - 68

ఇండియాటుడే: బీజేపీ 47-55, కాంగ్రెస్‌ 13-20, ఇతరులు 2 
టైమ్స్‌ నౌ: బీజేపీ 51, కాంగ్రెస్‌ 16, ఇతరులు 1 
ఏబీపీ- సీఎస్‌డీఎస్‌: బీజేపీ 32-38, కాంగ్రెస్‌ 16-22


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: