ఏపీలో కొత్త సంచలనం.. డ్రోన్లతో వ్యవసాయం..!

Edari Rama Krishna
డ్రోన్లు.. ఈ మాట ఎక్కడో విన్నట్టు ఉంది కదూ.. చేతిలో రిమోట్ ఆకాశంలో విహరించే బుల్లి విమానం. కానీ దీన్ని సరిగ్గా వాడుకోవాలే కానీ..ఇది చేయని అద్భుతాలు లేవు. ఇప్పటికే సినిమా షూటింగుల్లో దీన్ని విస్తృతంగా వాడుతున్నారు. ప్రముఖుల రక్షణ కోసం కూడా డ్రోన్ విమానాలను వాడుతున్నారు. మనుషులు చొరబడలేని ప్రాంతాలకు ఇవి సులభంగా వెళ్లి పనిచక్కబెట్టుకొస్తాయి. 


అలాంటి డ్రోన్ టెక్నాలజీతో ఇప్పుడు ఏపీ కొత్త ప్రయోగాలు చేస్తోంది. ఈ డ్రోన్ టెక్నాలజీని వ్యవసాయానికి వాడబోతోంది. టెక్నాలజీని వాడుకోవడంలో ఏపీ సీఎం చంద్రబాబు ఈ ప్రయోగం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏపీలో రేషన్ దుకాణాల ఆధునికీకరణ దగ్గర నుంచి కైజాలా యాప్ వినియోగం వరకూ వీలైనంత వరకూ టెక్నాలజీకి పెద్ద పీట వేస్తున్న సంగతి తెలిసిందే కదా. 


ఇప్పుడు డ్రోన్ల వినియోగాన్ని పంటపొలాలపై పురుగుమందుల పిచికారీ  డ్రోన్ల ద్వారా చేపట్టనున్నట్లు చంద్రబాబు ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించారు. భూసారపరీక్షలకు కూడా డ్రోన్ టెక్నాలజీ వినియోగిస్తామన్నారు. ఇప్పుడు అది ఆచరణలోకి రాబోతోంది. రైతులకు పంటపొలంలో తెగుళ్లకు మించిన శత్రువు ఉండరు. వాటి నివారణకు ఇకపై సర్కారు అండగా నిలుస్తుంది. 


డ్రోన్ టెక్నాలజీ ఎందుకంటే.. ఒక రైతు పురుగుమందులు పిచికారీ చేస్తే అవి కాస్తా పక్క పొలాల్లోకి పారిపోతుంటాయి. అందువల్ల ఆ ప్రాంతంలోని రైతులందరూ పిచికారీ చేయాల్సి వస్తోంది. ఈ సమస్య లేకుండా ఇకపై ప్రభుత్వమే డ్రోన్ల సాయంతో పురుగుమందుల పిచికారీ చేపట్టబోతోంది. అంతే కాదు.. రైతుల కోసం మరో యాప్ ను కూడా ఏపీ సర్కారు అందుబాటులోకి తీసుకురాబోతోంది. కొత్తగా అభివృద్ధి చేసిన ఈ యాప్‌ ద్వారా పొలంలో ఏయే ఖనిజాలు, లవణాలు ఉన్నాయో సులభంగా తెలిసిపోతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: