ప్రపంచంలోనే అతి బరువైన మహిళ ఇకలేరు..!

Edari Rama Krishna
డాక్టర్లు ఎంత వారిస్తున్నా..ఆరోగ్యానికి హానికరం అన్నా చాలా మంది జంగ్ ఫుడ్ తినడం వల్ల స్థూలకాయంగా మారుతున్నారు.  అయితే కొంత మంది జన్యూలోపం వల్ల కూడా స్థూలకాయం ఏర్పడుతుంది. ఇక ప్రపంచంలోనే అత్యధిక బరువు కలిగిన ఈజిప్టు మహిళ ఎమాన్‌ అహ్మద్‌ 500 కేజీల బరువుతో భారీ స్థూలకంగా మారి చాలా ఇబ్బందులు పడుతూ ఉండేది. అయితే ముంబైలోని సైఫీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె భారీగా బరువు తగ్గినట్టు వైద్యులు తెలిపారు.

ఈజిప్ట్ కు చెందిన 36 ఏళ్ల ఎమన్ అహ్మద్ 504 కేజీల బరువుతో ప్రపంచంలోనే భారీ బరువు ఉన్న మహిళగా గుర్తింపు పొందింది. చికిత్స కోసం  ప్రత్యేక కార్గో విమానంలో అలగ్జాండ్రియా నగరం నుంచి ముంబై తీసుకొచ్చారు. సైఫి ఆస్పత్రిలో 2017 మే 4వ తేదీన చేరిన ఎమన్.. బెరియాట్రిక్ సర్జన్ ద్వారా 300 కేజీలకు తగ్గారు.  

ఆమెను ప్రత్యేకంగా కార్గో విమానంలో ముంబైకు తీసుకురాగా,  రెగ్యులర్‌ విమానంలో బిజినెస్‌ క్లాస్‌లో వెళ్లవచ్చని తెలిపారు. మరోవైపు ఎమాన్ బరువు తగ్గలేదని.. ఆమె ఆరోగ్య పరంగా మరిన్ని చిక్కులు ఎదుర్కొంటోందని షైమా తెలిపింది.  దీంతో, ఆమెకు చికిత్స అందించిన డాక్టర్లు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.  

తాజాగా ముంబై నుంచి అబుదాబి వెళ్లి అక్కడి చికిత్స పొందుతున్న ఎమన్.. ఈ ఉదయం ఆస్పత్రిలోనే కన్నుమూసినట్లు వెద్యులు ప్రకటించారు.  భారీ బరువు కారణంగా ఎమన్ అహ్మద్ ఇప్పటికే గుండె, ఊపిరితిత్తులు, కిడ్ని, నరాల సంబంధం వ్యాధులతో కూడా బాధపడుతుంది. ఈ ఉదయం కిడ్ని ఇన్ఫెక్షన్ తోపాటు హార్ట్ ఎటాక్ రావటంతో చనిపోయింది.సోమవారం ఉదయం చికిత్స పొందుతూ హార్ట్ ఎటాక్ తో చనిపోయినట్లు వెల్లడించారు వైద్యులు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: