జగన్ కు ఝలక్..! నంద్యాలలో కేసు నమోదు!

Vasishta

వైసీపీ అధినేత జగన్ పై కేసు నమోదైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఈసీ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ వ్యాఖ్యలు ఎన్నికల నియమావళి పరిధిలోకి వస్తాయని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేస్తూ.. వెంటనే కేసు నమోదు చేయాలని స్థానిక అధికారులను ఆదేశించింది.


కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జగన్ పై ఐపీసీ 188, 504, 506 సెక్షన్ల కింత ప్రజాప్రాతినిధ్య చట్టం 125 ప్రకారం నంద్యాల త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు తర్వాత తదుపరి విచారణ అనంతరం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.


ముఖ్యమంత్రి చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపినా పర్లేదంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే అక్కడ స్పందన లేకపోవడంతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సీఈసీ ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుందని తేల్చింది. దీనిపై వెంటనే కేసు నమోదు చేయాలని ఆదేశించింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: