ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్ ప్రేమలో పడ్డారు..!.. ఫోటో వైరల్ అయ్యింది..!

Chakravarthi Kalyan
ఎమ్మెల్యే అంటే ప్రజాప్రతినిధి.. ప్రజలకు సంబంధించినంతవరకూ ఈయనే తమ నియోజకవర్గ పాలకుడు.. ఇక ఐఏఎస్.. ఈయన అసలైన పాలకుడు.. పేరుకు ముఖ్యమంత్రి, మంత్రుల చేతులో నిర్ణయాలు జరిగినా.. వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది వీరే.. అందుకే ఈ రెండు వర్గాల మధ్య తరచూ ఘర్షణ వాతావరణం ఉంటుంది. ఒకరిపై మరొకరు చిర్రుబుర్రలాడుతుంటారు. 


కానీ విచిత్రంగా కేరళలో ఒక ఎమ్మెల్యే, ఒక సబ్ కలెక్టర్ ప్రేమలో పడ్డారు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే కె.ఎస్. శబరినందన్ , తిరువనంతపురం సబ్ కలెక్టర్ డాక్టర్ దివ్య అయ్యర్ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే ఫేస్ బుక్ ద్వారా కన్ ఫామ్ చేస్తూ వారిద్దరూ కలసి దిగిన సెల్ఫీని పోస్ట్ చేశారు. 


ఎమ్మెల్యే తన పోస్టులో ఇలా రాశారు.. సబ్‌ కలెక్టర్‌ డాక్టర్‌ దివ్య ఎస్‌ అయ్యర్‌ను తిరువనంతపురంలో కలిశాను.. సాన్నిహిత్యం పెరిగాక  తెలిసింది మా ఇద్దరి ఆలోచనలు, ఆసక్తులు, దృక్పథాలు ఒకటేనని..  ఇరు కుటుంబాల ఆశీర్వాదంతో దివ్య త్వరలో నా జీవిత భాగస్వామి కాబోతోంది.. చూడముచ్చటైన జంట కావడంతో ఈ పోస్ట్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. 



ఎమ్మెల్యే శబరినందన్ మాజీ స్పీకర్, దివంగత నేత కార్తికేయన్ కుమారుడు. కార్తికేయన్ గతంలో టాటా ట్రస్ట్ లో పనిచేసేవారు. శబరినందన్ తండ్రి మరణం తర్వాత రాజకీయాలలోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యారు. మరో విశేషం ఏంటంటే..  కార్తికేయన్ తండ్రి కార్తికేయన్ ది కూడా ప్రేమ వివాహమే.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: