ఆ రెండు ఆంధ్రా జిల్లాల్లో కులం జులుం మరీ ఎక్కువా..!?

Chakravarthi Kalyan
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరవాత రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ప్రత్యేకించి ఆంధ్రాలో సామాజిక రాజకీయ సమీకరణాలు కులాల వారీగా తమ ప్రభావం చూపుతున్నాయి. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలో కుల ప్రభావం చాలా ఎక్కువన్న సంగతి ఇప్పటికే చాలా విషయాల్లో రుజువైంది.



ప్రత్యేకించి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఈ కులం ప్రభావం మరీ ఎక్కువ అంటున్నారు ప్రముఖ రచయిత, దళిత ఉద్యమనాయకుడు కత్తి పద్మారావు. ఇటీవల తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.. ఈ ఎంపికలను ఆయన విశ్లేషిస్తూ.. టిడిపి నేత కరణం బలరాంకు పదవి ఇవ్వడాన్ని కత్తి పద్మారావు తప్పుబట్టారు. 


కేవలం కులం బలం వల్లే బలరామ్ కు చంద్రబాబు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చారని.. కానీ బలరామ్ కు ఉన్న నేర చరిత్రను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదని కత్తి అంటున్నారు. హత్యలు చేశారన్న అబియోగం ఎదుర్కుని జైలులో ఉండివచ్చిన బలరాం ఆ తర్వాత దళితవాడను దగ్దం చేయించాడని పద్మారావు గుర్తు చేసుకున్నారు. 


ఎమ్మెల్సీ అంటేనే పెద్దల సభ అని మేథావులు, రాజకీయ పండితులు, అనుభవజ్ఞులు, ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొలేనివారు ఇలాంటి వారికి ప్రాధాన్యం ఇవ్వాలని.. కానీ ఎలాంటి రాజకీయ అనుభవం లేని లోకేష్ కు కూడా ఎమ్మల్సీ పదవి ఇవ్వడం సముచితం కాదని కత్తి పద్మారావు అభిప్రాయపడ్డారు. ఇది వారసత్వ రాజకీయం అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఆంధ్రాలో ప్రత్యేకించి గుంటూరు, కృష్ణా జిల్లాలలో ఒక సామాజికవర్గం జులుం పెరిగిందని పద్మారావు అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: