రోజా.. రోజుకొకడితో పడుకునే ఎమ్మెల్యే ఎవరమ్మా..!?

Chakravarthi Kalyan
వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో అనుచిత ప్రవర్తన కారణంగా ఓ ఏడాది పాటు సస్పెన్షన్ కు గురైన సంగతి తెలిసిందే. ఇలా ఓ ఎమ్మెల్యే ఏడాది పాటు సస్పెండ్ కావడం ఇదే తొలిసారి. మరి రోజాపై అంత తీవ్రమైన చర్య ఎందుకు తీసుకున్నారు.. దీనికి అధికార పార్టీ చెప్పే వివరణ ఒక్కటే.. ఆమె ముఖ్యమంత్రిని పట్టుకుని కామ ముఖ్యమంత్రి... సెక్స్ ముఖ్యమంత్రి అంటూ అసభ్యంగా మాట్లాడారు అని. 

రోజా తన స్థానం నుంచి దూసుకువచ్చి ముఖ్యమంత్రి ముందుకు వచ్చి నినాదాలు చేశారన్నది అధికార పక్షం వాదన. ఓ ముఖ్యమంత్రిని పట్టుకుని సెక్స్ ముఖ్యమంత్రి అని అసభ్యంగా మాట్లాడితే సస్పెండ్ చేయడంలో ఏమాత్రం తప్పులేదని అధికార పార్టీ సమర్థించుకుంటోంది. కానీ అసలు కారణం అదేనా.. అంతకు మించి ఇంకేమైనా ఉందా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

అసెంబ్లీలో కెమేరాలు కొన్నియాంగిళ్లలోనే చిత్రీకరించడం వల్ల.. రోజా ఏం చేసిందో లైవ్ లో చూసేవారికి కనిపించే అవకాశం లేదు. గందరగోళం వల్ల మాటలు కూడా వినిపించే అవకాశం లేదు. కానీ అసలేం జరిగిందంటే.. రోజా ముఖ్యమంత్రిని తిట్టడంతో పాటు దళిత ఎమ్మెల్యే అయిన వంగలపూడి అనితను చెప్పలేని భాషలో నిండుసభలో తిట్టిందట. గతంలో అనిత రోజాపై ప్రివేలేజ్ మోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

రోజుకొకడితో పడుకునే నువ్వేంటే నాకు చెప్పేది అంటూ అనితపై మాటల యుద్ధం చేసిందట. పాపం మరీ ఆ స్థాయిలో మాట్లాడితే అధికార పక్షం కూడా ఏం చెబుతుంది ప్రజలకు. అందుకే రోజా పచ్చి బూతులు మొత్తం చెప్పలేక.. ముఖ్యమంత్రిని తిట్టిన మాటలనే ప్రస్తావిస్తున్నారు. నిండు సభలో ముఖ్యమంత్రి ముందుగానే అలాంటి బూతు పురాణం విప్పడంతో ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక లాభం లేదు.. తగిన గుణపాఠం చెప్పాల్సిందే అని డిసైడ్ అయ్యారట.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: