ఇక బస్సుల్లో "తెలంగాణ టికెట్లు''

Padmaja Reddy
రాష్ట్రం విడిపోయి నెలలు పూర్తి అయినా ఇప్పటి వరకూ కూడా ఆర్టీసీ బస్సుల్లో మాత్రం ఏపీఎస్ ఆర్టీసీ పేరుతోనే టికెట్ల అమ్మకం జరిగింది. హైదరాబాద్ సిటీలో అయినా.. తెలంగాణలోని గ్రామీణ సర్వీసుల్లోనైనా ఏపీఎస్ ఆర్టీసీ టికెట్లే ఇవ్వసాగారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు మొదలైంది. ఇక నుండి టీఎస్ ఆర్టీసీ టికెట్లు ముద్రించాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు రోడ్డు రవాణా సంస్థలో విభజన మొదలైంది. ఇన్ని రోజులూ ఉమ్మడిగానే ఉన్నా.. ఇకపై మాత్ర ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ వ్యవస్థల విభజన ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఇరు రాష్ట్రాల పద్దులూ వేరవుతాయని.. ఇకపై ఎవరి ఆదాయం వారిదే, ఎవరి నష్టాలు వారివేనని వారు చెబుతున్నారు. అందుకోసం ప్రత్యేక అకౌంట్లు మొదలు పెట్టనున్నట్టు తెలుస్తోంది. మరి ఇన్ని రోజులూ ఉమ్మడిగానే ఉంచి ఇప్పుండేంటి ఇలా.. అంటే దానికి కేసీఆర్ ఇచ్చిన వరమే కారణం అని తెలుస్తోంది. తెలంగాణ పరిధిలో ఆర్టీసీ ఉద్దరణకై ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ప్రత్యేక గ్రాంటు ప్రకటించాడు. 250 కోట్ల రూపాయల నిధులు ఇస్తున్నట్టు తెలిపాడు. దీంతో తెలంగాణ ప్రాంత ఆర్టీసీ అధికారులు అలర్ట్ అయ్యారు. విభజన వెంటనే చేసుకోవాల్సిందేనని వారు అంటున్నారు. కేసీఆర్ ఇచ్చే నిధులు ఖర్చు పెట్టాలంటే అది విభజన తర్వాతే సాధ్యం అవుతుంది. అందుకే ఇక ఎవరి అకౌంట్లు వారివే అనుకొవడానికి వారు రెడీ అయ్యారు. పనిలో పనిగా టికెట్ల ముద్రణ, టికెట్ల రిజర్వేషన్ లను కూడా విభజించేసుకోవాలని నిర్ణయించారు. మరి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కూడా ఉమ్మడిగానే నడిచిన ఈ వ్యవస్థ కూడా ఇక పూర్తిగా విభజనకు గురయినట్టేనేమో!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: