అమరావతి : ఈ సెంటిమెంటైనా పవన్ను గెలిపిస్తుందా ?

Vijaya
వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడినుండి పోటీచేస్తారు ? ఇప్పటికే ఇది సమాధానం లేని బేతాళ ప్రశ్నలాగే ఉంది. అయితే పార్టీవర్గాల సమాచారం ప్రకారమైతే తిరుపతి నుండి పోటీచేస్తే ఎలాగుంటుందనే విషయమై ఈమధ్యనే పవన్ సర్వే చేయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే పవన్ పోటీచేయబోయేది ఇక్కడినుండే అంటు చాలా నియోజకవర్గాల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో భాగంగానే తిరుపతిలో పవన్ సర్వే చేయించుకున్నారు అనేది కొత్త ట్యాగ్ లైన్.ఇంతకీ విషయం ఏమిటంటే 2009 ఎన్నికల్లో అన్న, మెగాస్టార్ చిరంజీవి తిరుపతి నుండే పోటీచేసి గెలిచారు. అప్పట్లో చిరంజీవి కూడా పాలకొల్లు, తిరుపతి రెండుచోట్ల పోటీచేస్తే పాలకొల్లులో ఓడిపోయి తిరుపతిలో గెలిచారు. అలాగే అంతకముందు టీడీపీ వ్యవస్ధాపకుడు ఎన్టీయార్ కూడా తిరుపతి నుండి  పోటీచేసి గెలిచారు. అంటే సినీరంగం నుండి వచ్చి పార్టీ పెట్టిన ఎన్టీయార్, చిరంజీవిని తిరుపతి ఆదరించిందనే సెంటిమెంటు గురించే  పవన్ ఆలోచిస్తున్నారట.కాబట్టి అదే సెంటిమెంటును తాను కూడా ఫాలో అయి తిరుపతి నుండి పోటీచేస్తే గెలుపు గ్యారెంటీ అని పవన్ నమ్ముతున్నారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. సెంటిమెంటుకు తోడు తిరుపతిలో మెజారిటి ఓటర్లు బలిజలు (కాపు) ఉండటం కూడా పవన్ గెలుపుకు బాగా కలిసొస్తుందని జనసేన నేతలు అంటున్నారు. అప్పట్లో చిరంజీవి గెలుపుకు బలిజ ఓట్లే కీలకమైన విషయాన్ని పార్టీ నేతలు గుర్తుచేసుకుంటున్నారు.సో పార్టీ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే సెంటిమెంటు+బలిజల ఓట్ల ప్రకారమైతే పవన్ తిరుపతిలో పోటీచేయటానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తోంది. పోయిన ఎన్నికల్లో పోటీచేసిన భీమవరం, గాజువాకలో పవన్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అప్పటినుండి వైసీపీ నుండి పవన్ పై విపరీతమైన నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతోంది. అందుకనే వచ్చే ఎన్నికల్లో గెలుపు పవన్ కు అత్యంత ప్రిస్టేజిగా మారిపోయింది. వచ్చే ఎన్నికల్లో కూడా పవన్ ఓడిపోతే ఇక అంతే సంగతులు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: