ఆంధ్రప్రదేశ్: ఆ కేసుల్లో టాప్ ప్లేస్?

Purushottham Vinay
ఆంధ్ర ప్రదేశ్ లో గతంలో ఎన్నడూ లే నివిధంగా కోర్టు ధిక్కారణ కేసులు అనేవి చాలా పెరిగిపోతున్నాయి. గత మూడు సంవత్సరాలలో ఏకంగా 350 శాతం కేసులు పెరగడం ఆందోళన కల్గిస్తోంది.ఇక పెరుగుతున్న కోర్టు ధిక్కరణ కేసులు ఓ ప్రమాదకర పరిస్థితికి అద్దం పడుతున్నాయి.ఆంధ్రప్రదేశ్ లో గత మూడేళ్లుగా అంటే 2019 వ సంవత్సరం నుంచి కోర్టు ధిక్కరణ కేసులు చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. వివిధ కేసుల్లో ఇంకా అలాగే వివిధ సందర్భాల్లో హైకోర్టు ఆదేశాల్ని అమలు చేయడంలో విఫలం కావడంతో నమోదైన కేసులివి. కోర్టు ధిక్కరణ కేసులు బాగా విపరీతంగా పెరగడం ఓ ప్రమాదకర స్థితిని సూచిస్తుంది.ఈ కోర్టు ధిక్కరణ కేసులు ఏపీలో చాలా ఎక్కువగా ఉన్నాయని, దేశంలో చాలా ఎక్కువగా ఏపీలోనే ఈ కేసులున్నాయని లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం తెలిపింది.


ఇక లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ లిఖిత పూర్వకంగా వివరాలను అందించడం జరిగింది.ఇక ఏడు రాష్ట్రాల్లో మొత్తం 28,469 కోర్టు ధిక్కరణ కేసులుండగా, ఒక్క ఏపీలోనే మొత్తం 11 వేలకు పైగా కేసులు పెండింగులో ఉన్నాయని కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో 11,348 కేసులుంటే..తెలంగాణ రాష్ట్రంలో 6,236 కేసులున్నాయి.ఇక రాజస్థాన్, కర్ణాటక, కోల్‌కతా, పాట్నా ఇంకా అలాగే జమ్ముకశ్మీర్ రాష్ట్రాల్లో కూడా కోర్టు దిక్కరణ కేసులు చాలా ఎక్కువగానే ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది.ఇక దేశవ్యాప్తంగా అన్ని హైకోర్టుల్లో కలిపి మొత్తం ఏకంగా 16,42,371 రిట్ పిటీషన్‌లు పెండింగులో ఉన్నాయని కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ తెలిపింది.అలాగే న్యాయస్థానాల్లో పెండింగు కేసుల సంఖ్య పెరిగిపోవడంపై ఈమధ్య కొద్దికాలంగా చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వివరాలివి.ఇక మొత్తానికి ఈ కేసుల్లో ఆంధ్ర ప్రదేశ్ టాప్ లో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: