అమరావతి : చిరంజీవి చుట్టూ బీజేపీ ఉచ్చు బిగిస్తోందా ?

Vijaya
వచ్చే ఎన్నికల్లో గట్టి ప్రభావం చూపేందుకు బీజేపీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్  రూపంలో పెద్ద సెలబ్రిటీ ఉన్నప్పటికీ ఎందుకనో కమలంపార్టీ సంతృప్తిగా లేదు. అందుకనే మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీయార్ కు గట్టిగా గాలమేస్తోంది. వీళ్ళిద్దరినీ ఎలాగైనా ఒప్పించి వచ్చేఎన్నికల్లో తమకు అనుకూలంగా ప్రచారం చేయించుకోవటమే టార్గెట్ గా పెట్టుకున్నట్లుంది. తాజాగా మెగాస్టార్‌ను ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటి ఆఫ్ ది ఇయర్-2022గా కేంద్రప్రభుత్వం ప్రకటిచటం ఇందులో భాగమనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఒక చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతు తమపార్టీ బలోపేతానికి అందుబాటులో ఉన్న అన్నీ అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకుంటామన్నారు. తమ ప్రణాళికలో భాగంగానే తాను చిరంజీవిని కలిశానని,  జూనియర్ ఎన్టీయార్ తో అమిత్ షా బేటీని ప్రస్తావించారు. అవసరమైనపుడు తాము తయారుచేసుకుంటున్న బాంబులు ఒక్కసారిగా పేలుతాయని చెప్పారు.వీర్రాజు వ్యాఖ్యలు చేసిన రెండురోజులకే చిరంజీవిని ఫిల్మ్ పర్సనాలిటి ఆఫ్ ది ఇయర్ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీర్రాజు ప్రకటనకు కేంద్రప్రభుత్వం ప్రకటనకు ఏమన్నా లింకుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఆమధ్య నరేంద్రమోడీ నరసాపురం పర్యటనలోనే చిరంజీవిని బీజేపీలో చేరమన్నారని, అందుకు మెగాస్టార్ సున్నితంగా తిరస్కరించారనే ప్రచారం తెలిసిందే. ఆ తర్వాత జూనియర్ తో హైదరాబాద్ లో అమిత్ షా భేటీ కూడా సంచలనమైంది. ఇద్దరి మధ్య కచ్చితంగా రాజకీయాలే చర్చకు వచ్చుంటాయనేది అందరి అనుమానం.కమలనాదుల సమాచారం ప్రకారం జూనియర్‌ను  బీజేపీకి మద్దతుగా ప్రచారం చేయాలని అమిత్ కోరారట. దానికి జూనియర్ ఏమన్నారనే విషయంలో స్పష్టతలేదు. సో తాజాగా వీర్రాజు మాటలుచూస్తుంటే చిరంజీవి, జూనియర్‌ను రాబోయే ఎన్నికల్లో ప్రచారానికి దింపే అవకాశాలున్నాయని అర్ధమవుతోంది. చిరంజీవి కూడా చాలాకాలం తర్వాత మళ్ళీ రాజకీయాలు మాట్లాడుతున్నారు. తమ్ముడికి మద్దతుగా ప్రకటనలు చేస్తున్నారు.  దీంతో అంతా బీజేపీ స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతోందనే వాదన కూడా బలపడుతోంది. మరి ఎన్నికల ముందు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: