ఉతరాంధ్ర : ఎల్లోమీడియా ఇందుకేనా యాక్టివ్ అయ్యింది ?

Vijaya






జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎల్లోమీడియా ఒక్కసారిగా బాగా యాక్టివ్ అయిపోయింది. దీనికి కారణం ఏమిటంటే ప్రభుత్వం లేదా అధికారపార్టీని ఎదుర్కోవటంలో తెలుగుదేశంపార్టీ పూర్తిగా ఫెయిలవ్వటమే. అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలని అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో పాదయాత్ర జరుగుతోంది. గోదావరి జిల్లాలో నుండి తొందరలోనే పాదయాత్ర ఉత్తరాంధ్రలోకి అడుగుపెడుతోంది. ఈ నేపధ్యంలోనే పాదయాత్రకు తీవ్ర వ్యతిరేకత మొదలైంది.



జేఏసీ ఆధ్వర్యంలో పాదయాత్ర జరుగుతుంటే ఉత్తరాంధ్ర జేఏసీ నేపధ్యంలో అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీలు, ప్రదర్శనలు ఊపందుకుంటున్నది. ఈ మొత్తానికి వైజాగ్ కేంద్రబిందువుగా మారింది. ఈనెల 15వ తేదీన మూడురాజధానులకు మద్దతుగా జేఏసీ నాయకత్వంలో ప్రజాగర్జన పేరుతో భారీ బహిరంగసభ జరగబోతోంది. ఆ బహిరంగసభ సక్సెస్ అయితే అమరావతి డిమాండ్ మూలనపడిపోతుందనే భయం మొదలైనట్లుంది.



అందుకనే హఠాత్తుగా వైసీపీ నేతలంతా విశాఖపైకి దండయాత్ర చేస్తున్నారు, భూకబ్జాలు చేస్తున్నారు, ప్రభుత్వం, ప్రైవేటు భూములు దోచుకునేస్తున్నారంటు కథనాలు, వార్తలు వండివారుస్తున్నారు. రాసినవార్తలే, అచ్చేసినకథనాలనే మళ్ళీ మళ్ళీ తిప్పితిప్పి అచ్చేస్తుండటంతో జనాలు కూడా అదే నిజమేనేమో అనుకోవాలన్నది ఎల్లోమీడియా ఉద్దేశ్యంగా కనబడుతోంది. అయితే ఇందులో చాలావరకు తప్పులన్న విషయం అందరికీ తెలుసు. కూర్మన్నపాలెంలో వైసీపీ ఎంపీ ఎంవీవీ మూర్తి భూ యజమానులతో డెవలప్మెంట్ కోసం ఏకపక్షంగా ఒప్పందం చేసుకున్నారని గోలమొదలుపెట్టింది. అయితే ఈ ఒప్పందం చేసుకున్నది 2018లో.



అప్పుడు మూర్తి ఎంపీకాదు కేవలం బిల్డర్ మాత్రమే. అప్పట్లో అధికారంలో ఉన్నది టీడీపీనే. ఆ ఏకపక్ష ఒప్పందం జరిగినపుడు బహుశా టీడీపీ ప్రముఖులే బిల్డర్ తరపున చక్రం తిప్పుంటారు. అప్పట్లో జరిగిన ఒప్పందాన్ని ఇపుడే జరిగినట్లు ఎల్లోమీడియా కథనాలు రాయటమే విచిత్రంగా ఉంది. ఇక్కడ విషయం ఏమిటంటే టీడీపీ అంచనాలకు మించి ప్రజాగర్జన సక్సెస్ అవుతుందనే భయం పెరిగిపోతున్నట్లుంది. దీన్ని టీడీపీ ఆపలేకపోతోంది. అందుకనే ఆ బాధ్యతను ఎల్లోమీడియా భుజనేసుకున్నట్లుంది. మొత్తానికి విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా టీడీపీనే కాదు ఎల్లోమీడియాను కూడా కలవరపెడుతున్నట్లు అర్దమవుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: