స్పామ్ కాల్స్ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాయా?
వాస్తవానికి మనకు వచ్చే కాల్స్ లో ఎక్కువగా రోబో కాల్స్ ఉంటాయి. ఈ కాల్స్ ముందుగా రికార్డు చేయబడి ఉంటాయి. ఫోన్ లిఫ్ట్ చేయగానే ఆటోమేటిక్ గా రికార్డు అయిన వాయిస్ ను వినిపిస్తుంది. టెలి మార్కెటింగ్ కాల్స్ కూడా చాలా వస్తుంటాయి. ప్రజలకు తమ ప్రొడక్ట్స్ గురించి వివరించి మార్కెట్ చేసుకునేందుకు పలు కంపెనీలు ఈ కాల్స్ చేస్తుంటాయి. మోసపూరిత ఉద్దేశంతో కూడిన స్పామ్ కాల్స్ అనేవి యూజర్లకు సంబంధించిన బ్యాంక్ డేటా సహా అత్యంత ముఖ్యమైన వివరాలను దొంగిలించే ప్రయత్నం చేస్తాయి.
ఇలాంటి అవాంఛిత కాల్స్ నుంచి రక్షణ పొందేందుకు గూగుల్ రెండు ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్లు కాలర్ ID, స్పామ్ ప్రొటెక్షన్ లతో డిఫాల్ట్ గా ఆండ్రాయిడ్ ఫోన్లలో ఆన్ అవుతాయి. ఒక వేళ ఆన్ చేయకపోతే వినియోగదారులు స్పామ్ కాల్స్ రాకుండా ఉండేలా ఈ సెట్టింగ్స్ మార్చుకుంటే సరిపోతుంది.ఇక పోతే ఈ స్పామ్ కాల్స్ ను ఎలా గుర్తించాలి అంటే..
ముందుగా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లో ఫోన్ యాప్‌ని ఓపెన్ చేయాలి.
యాప్ కింది భాగంలో రీసెంట్ ట్యాబ్‌ను నొక్కాలి.
ఇప్పుడు మీరు స్పామ్ గా రిపోర్టు చేయాలి అనుకుంటున్న కాల్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు బ్లాక్ చేయాలి. లేదంటే, స్పామ్ రిపోర్టు కొట్టాలి.
కొన్ని వైర్లెస్ క్యారియర్లు కూడా కాల్ బ్లాకింగ్ ఫీచర్‌ను అందిస్తాయి. అవేంటో చూడండి.. AT&T ActiveArmor Ios, Android కోసం అందుబాటులో ఉంది. ఇది స్పామ్ కాల్స్ ను బ్లాక్ చేస్తుంది. T-Mobile స్కామ్ షీల్డ్ కస్టమర్లను రోబోకాల్స్ నుంచి రక్షించడానికి బహుళ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇకపోతే Hiya అనే యాప్ కూడా స్పామ్ కాల్స్ ను నిరోధిస్తుంది. Nomorobo కూడా వినియోగదారులకు స్పామ్ కాల్స్ ను రాకుండా చేస్తుంది. ఫైర్‌వాల్ యాప్ ఐఫోన్లో మాత్రమే అందుబాటులో ఉంది..