రేషన్ కార్డుదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్..!!

Satvika
రేషన్ కార్డుదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్..కేంద్ర ప్రభుత్వం తాజాగా గుడ్ న్యూస్ ను చెప్పింది.మోదీ సర్కార్ త్వరలోనే ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పై కీలక నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. పేదలకు అందించే ఉచిత రేషన్‌ను సెప్టెంబర్ 30 తర్వాత కూడా పొడిగించే ఛాన్స్ ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి.ఫుడ్ సెక్రటరీ సుదాన్సు పాండే మాట్లాడుతూ.. కేంద్రం త్వరలోనే ఉచిత రేషన్‌పై ఒక నిర్ణయం తీసుకోవచ్చన్నారు.

అయితే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మాత్రం ఈయన తెలియజేయలేదు. ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన 2020 మార్చి నెలలో తీసుకువచ్చారు. దీనిలో భాగంగా 80 కోట్ల మంది రేషన్ కార్డు లబ్ధిదారులకు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఉచితంగా బియ్యం అందిస్తున్నారు..ఒక్కో వ్యక్తికి 5 కేజీల చొప్పున ఉచిత బియ్యం వస్తున్నాయి. అంటే ఒక కార్డులో నలుగురు ఉంటే.. 20 కేజీల ఉచిత బియ్యం వస్తాయి. ఈ ఉచిత బియ్యం అనేవి రాష్ట్ర ప్రభుత్వాలు అందించే కోటాకు అదనమని గుర్తించుకోవాలి...

ఇప్పటివరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉంది.. ఈ నెల 30 వరకూ చివరి గడువు ఉంది.కేంద్ర ప్రభుత్వం మార్చి నెలలో ఈ స్కీమ్ గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ చివరి వరకు పథకాన్ని పొడిగించారు.మోదీ సర్కార్ మార్చి నెల చివరికి ఈ స్కీమ్‌పై రూ. 2.6 లక్షల కోట్లు ఖర్చు చేసింది. సెప్టెంబర్ చివరి కల్లా మరో రూ. 80 వేల కోట్లు అదనంగా భారం పడింది. దీంతో ప్రభుత్వం మొత్తంగా పీఎంజీకేఏవై కింద రూ. 3.4 లక్షల కోట్లు ఖర్చు చేసింది. అయితే మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ గడువును పొడిగించకపోవచ్చని కొంత మంది అంచనా వేస్తున్నారు. అందువల్ల ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి..ఈ స్కీమ్ పొడిగిస్తే చాలా మందికి ప్రయోజనం ఉంటుంది..ప్రభుత్వం ఎప్పుడూ ఎలా  ఆలోచిస్తుందో ఊహించడం కాస్త కష్టమే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: