సెకండ్ హ్యాండ్ కార్లపై కేంద్రం కొత్త రూల్స్?

Purushottham Vinay
మన దేశంలో ఈ మధ్య సెకండ్‌ హ్యాండ్‌ కార్ల మార్కెట్ చాలా వేగంగా విస్తరిస్తోంది.అందులోనూ ముఖ్యంగా ఆన్‌లైన్ వేదికగా క్రయ-విక్రయాలు జరిపే కంపెనీలు చాలా ఎక్కువగా వున్నాయి. ఇక అదే సమయంలో అనేక సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా కొత్త యజమానులకు వాహన బదిలీ, థర్డ్-పార్టీ డ్యామేజ్ బాధ్యతలు, డిఫాల్ట్‌ల నిర్ధారణలకు సంబంధించిన ఫిర్యాదులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని వినియోగిస్తున్న వాహనాల విషయంలో కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.సెంట్రల్ మోటర్ వెహికల్ రూల్స్ యాక్ట్-1989 ను మరింత పారదర్శకంగా అమలు చేయానికి సవరణలు చేసింది. ప్రీ-ఓన్డ్ కార్ మార్కెట్ కోసం సమగ్ర నియంత్రణ పర్యావరణ వ్యవస్థను నిర్మించడం తమ లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది.తాజాగా నోటిఫై చేసిన ముసాయిదా నిబంధనల ప్రకారం యూజ్డ్ కార్ డీలర్లు తమ వ్యాపారాన్ని నిర్వహించడానికి సంబంధిత రాష్ట్ర రవాణా అథారిటీ నుంచి ఆథరైజేషన్ సర్టిఫికేట్ పొందాలి. అలాగే వాహన యాజమాన్యాన్ని వారి పేర్లకు బదిలీ చేయాల్సి ఉంటుంది.కొత్త రూల్స్ ప్రకారం కారు విక్రయం డీలర్ ద్వారా మాత్రమే అమలు చేయనున్నారు. అసలు యజమాని, కొత్త కొనుగోలుదారు మధ్య ఇకపై ఎటువంటి లింక్ ఉండదు.


రాష్ట్ర రవాణా కార్యాలయంలో కారుకు సంబంధించిన కొత్త యజమాని వివరాలను అప్‌డేట్ చేసే బాధ్యత డీలర్‌పై ఉంటుంది.ఉపయోగించిన వాహనాల మార్కెట్‌పై నియంత్రణ ఉండడం ఎంతో అవసరం. ఇది చాలా కాలం నుంచి ఉన్న డిమాండ్. దీన్ని వీలైనంత వేగంగా అమలు చేయాలని ఆశిస్తున్నాను.అని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ మాజీ అధ్యక్షుడు, JS4 వీల్ మేనేజింగ్ డైరెక్టర్ నికుంజ్ సంఘీ పేర్కొన్నారు.ఇక కారు యాజమాన్య బాధ్యతలు డీలర్‌కు బదిలీ చేసే విధానాన్ని, డీలర్ అధికారాలు, బాధ్యతలనూ స్పష్టంగా తెలియజేస్తున్నాయి. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, డూప్లికేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, యాజమాన్యం బదిలీ కోసం నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్‌ల  కోసం దరఖాస్తు చేసుకోవడానికి కొత్త నిబంధనలు డీలర్లకు పూర్తి అధికారం కల్పిస్తాయి. 


డీలర్లు చేపట్టిన ట్రిప్పులు, ప్రయోజనం, డ్రైవర్, సమయం, మైలేజీ వంటి వాటికి సంబంధించిన వివరాలతో కూడిన ఎలక్ట్రానిక్ వెహికల్ ట్రిప్ రిజిస్టర్‌ను కూడా నిర్వహించాల్సి ఉంటుంది.మాలాంటి వాళ్ల రాకతో భారతదేశంలో వినియోగించిన కార్ల మార్కెట్ గత కొన్నేళ్లుగా గణనీయంగా వృద్ధి చెందిందని కార్స్ 24 ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కునాల్ ముంద్రా అన్నారు. ఈ మార్కెట్‌లో ఇప్పటికీ అనేక హెడ్‌రూమ్స్ ఉన్నాయని, ఇది మరింత వృద్ధి చెందడానికి నియంత్రిత మద్దతు కచ్చితంగా కీలకం కానుందన్నారు. 


ఈ మార్పులు సరైన దిశలో ఒక అడుగు మాత్రమేనని, వాటికి RTOల డిజిటలైజేషన్, ఏకీకృత పాన్-ఇండియా రోడ్ టాక్స్ స్ట్రక్చర్ వాటిని జోడించాలని కునాల్ అభిప్రాయపడ్డారు.ఈ కొత్త నిబంధనలు నమోదిత వాహనాల మీడియేటర్లు లేదా డీలర్‌లను గుర్తించడంలో, వారికి సాధికారత కల్పించడంలో సహాయపడతాయని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మకం లేదా కొనుగోళ్ల వ్యవహారాల్లో జరిగే మోసాలకు ఇకపై చెక్ పడనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: