హైదరాబాద్ : రాజగోపాల్ పరిస్ధితి ఇంత అన్యాయంగా ఉందా ?

Vijaya


సొంత కెపాసిటి ఏమిటో చూపిద్దామని అనవసరంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెచ్చిపెట్టిన ఉపఎన్నిక ఇది.  పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో కలిసి పనిచేయలేక ఏదో సాకుగా చూపించి కాంగ్రెస్ పార్టీకి ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేశారు కోమటిరెడ్డి. నిజానికి రాజీనామా చేయాల్సిన అవసరం లేకపోయినా ఓవరాక్షన్ చేసి మరీ ఉపఎన్నిక వచ్చేట్లు చేశారు. రేవంత్ కింద పనిచేయలేక బీజేపీలో చేరిపోయారు. రేపు బీజేపీ అభ్యర్ధిగా పోటీచేసి గెలవటం ఇపుడు రాజగోపాలరెడ్డికి ప్రిస్టేజ్ అయిపోయింది.తన గెలుపు నూరుశాతం తథ్యమని పదే పదే చెప్పిన మాజీ ఎంఎల్ఏ పరిస్ధితి ఏమిటి ? ఏమిటంటే ఒకవైపు బీజేపీ నేతలు మరోవైపు జనాలు మాజీఎంఎల్ఏకి చుక్కలు చూపిస్తున్నారట. ప్రచారంలో కొన్ని గ్రామాల ప్రజలు రాజగోపాల్ రెడ్డిని తమ ఊళ్ళల్లోకి రానివ్వటంలేదు. ఇదే సమయంలో పార్టీలోని చాలామంది నేతలు మాజీఎంఎల్ఏకి ఏమాత్రం సహకరించటంలేదట. పార్టీలోకి కొత్తగా చేరారు కాబట్టి అందరినీ కలుపుకుని వెళదామని చేస్తున్న ప్రయత్నాలన్నీ ఫెయిలవుతున్నట్లు సమాచారం.ప్రచారానికి తనతో కలిసి రావాలని రాజగోపాల్ ఎన్నిసార్లు ఫోన్లుచేసినా చాలామంది నేతలు పట్టించుకోవటంలేదట. దీనికి కారణం ఏమిటంటే రాజగోపాల్ కాంగ్రెస్ లో ఉన్నంతవరకు మాజీఎంఎల్ఏకి వ్యతిరేకంగా బీజేపీ నేతలే పెద్ద పెద్ద పోస్టర్లు వేయించారట. కోమటిరెడ్డికి వ్యతిరేకంగా వేయించిన పోస్టర్లను నియోజకవర్గం మొత్తంమీద కమలనాదులు అంటించారు.మొన్నటివరకు రాజగోపాల్ ను తామే అవినీతిపరుడిగా చిత్రీకరించి, వ్యతిరేక పోస్టర్లు అంటించి ఇపుడు అదే రాజగోపాల్ కు ఓట్లేసి గెలిపించమని జనాలను ఎలా అడగాలన్నది  పెద్ద సమస్యగా మారిపోయిందట. తనకు కమలనాదుల సహాయనిరాకరణను రాజగోపాల్ బండి సంజయ్ కి ఫిర్యాదు కూడా చేశారట. దాంతో బండి వెంటనే మనోహర్ రెడ్డి, సంజయ్ అనే ఇద్దరు నేతలను మునుగోడుకు పంపారట. నియోజకవర్గంలోని నేతలందరితో మాట్లాడి ఎలాగైనా రాజగోపాల్ గెలుపుకు సహకరించాలని నచ్చచెప్పాలని బండి ఆదేశించారట. మరి బండి ఆదేశాలను మునుగోడు నేతలు వింటారా ? రాజగోపాల్ కు సహకరిస్తారా అన్నది పెద్ద పజిల్లాగ మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: