అమరావతి : మాజీమంత్రి చూట్టూ ఉచ్చు బిగుసుకుంటోందా ?

Vijaya






మాజీ మంత్రి, చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన పొంగూరు నారాయాణ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రాజధాని అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణంపై దర్యాప్తు జరిపిన సీఐడీ ఐదుగురిని అరెస్టుచేసింది. అమరావతి నిర్మాణంపేరుతో సమీకరించిన వేలాది ఎకరాల్లో 1100 అసైన్డ్ భూములు కూడా ఉన్నాయి. అసైన్డ్ భూములంటే ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం ఇచ్చిన భూములు.



ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం ఇఛ్చిన అసైన్డ్ భూములను ఎవరు కొనకూడదు. ఎవరైనా కొన్నట్లు రుజువైతే వాళ్ళు శిక్షార్హులే. ఎస్సీ, ఎస్టీలు ఒకవేళ భూములను అమ్మాలని అనుకున్నా ఎవరూ కొనకూడదని చట్టం చెబుతోంది. ఇక్కడ ఎవరైనా అమ్మినట్లు, కొన్నట్లు నిర్ధారణైతే అమ్మిన వాళ్ళది కాదు తప్పు కొన్నవాళ్ళదే. ఒకవేళ ఏదైనా ప్రయోజపయోగానికి భూములు కావాలంటే అసైన్డ్ భూములను తిరిగి తీసుకునే హక్కు ప్రభుత్వానికి మాత్రమే ఉంది.



ఇలాంటి 1100 ఎకరాల అసైన్డ్ భూములను రాజధాని ప్రాంతంలో టీడీపీలోని కీలక వ్యక్తుల బినామీలు, నారాయణ మద్దతుదారులు కొనుగోలు చేశారని సీఐడీ దర్యాప్తులో తేలింది. ఈ మొత్తం భూమిలో ఇపుడు 169 ఎకరాలు కొనుగోలు చేసిన ఐదుగురు కొల్లి శివరాం, గట్టెం వెంకటేష్, చిక్కాల విజయసారధి, బడే ఆంజనేయులు, కొట్టి దొరబాబును సీఐడీ అరెస్టుచేసింది. వీళ్ళంతా నారాయణ తరపున భూములు కొనుగోలు చేసినట్లు సీఐడీకి ఆధారాలతో సహా దొరికింది.



అనంతవరం, కృష్ణాయపాలెం, కురగల్లు, నెకల్లు, లింగాయపాలెం, నవులూరు, రాయపూడి, తుళ్ళూరు, ఉద్దండరాయునిపాలెం,వెంకటపాలెం, మందడం గ్రామాల్లో 89.8 ఎకరాలను మాజీమంత్రి నారాయణ తన బంధువులు, పరిచయస్తుల పేర్లతో కొన్నట్లు సీఐడీ గుర్తించింది. వేరేచోట మరో 79.45 ఎకరాలను కొన్నట్లు గుర్తించింది. రామకృష్ణా హౌసింగ్ డైరెక్టర్ ఖాతాల ద్వారా మాజీమంత్రి కోసం రు. 15 కోట్ల చెల్లించినట్ల సీఐడీ ఆధారాలను సేకరించింది. మొత్తానికి నారాయణ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందనటానికి ఇదే తాజా డెవలప్మెంట. అమెరికా నుండి నారాయణ తిరిగి రాగానే విచారణ జరిపే అవకాశముందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: