రాయలసీమ : పవన్ దెబ్బకు టీడీపీకి ఫ్యూజులు ఎగిరిపోయాయా ?

Vijaya

తిరుపతిలో జరిగిన జనవాణి కార్యక్రమంలో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలకు చంద్రబాబునాయుడు అండ్ కో కు ఫ్యూజులు ఎగిరిపోయాయనే అంటున్నారు. కార్యక్రమంలో పవన్ మాట్లాడుతు వైసీపీ, టీడీపీకి మూడో ప్రత్యామ్నాయం అవసరమన్నారు. తన ఎన్నికల్లో టీడీపీకి మద్దతివ్వటానికి తన కారణాలు తనకున్నా వచ్చే ఎన్నికల్లో టీడీపీ కొమ్ముకాయటానికి తాను సిద్ధంగా లేనని స్పష్టంగా ప్రకటించారు. అంటే వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరిగానే పోటీచేస్తుందని చెప్పకనే చెప్పేసినట్లయ్యింది.జనసేనతో పొత్తుకు ఒకపుడు చంద్రబాబునాయుడే వెంటపడ్డారు. తాను పర్యటించిన ప్రతిచోటా జనసేనతో పొత్తుకు రెడీ అన్నట్లుగా చెప్పారు. కుప్పం రోడ్డుషోలో మాట్లాడుతు తాను పొత్తు ప్రతిపాదనలు పంపినా జనసేన స్పందించటంలేదని నిష్టూరాలాడారు. జనసేనకు తాను లవ్ ప్రజోజల్ పంపినా ఇంకా ఎలాంటి రెస్పాన్స్ రాలేదని చంద్రబాబు చెప్పటంతోనే పొత్తుకు ఎంత డెస్పరేట్ గా ఉన్నారో అర్ధమైపోయింది. సరే తర్వాత రెండుపార్టీల మధ్య జరిగిన పరిణామాల కారణంగా ఒకసారి పొత్తుంటుందని మరోసారి ఉండదని రకరకాలుగా ప్రచారమవుతోంది.జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే పొత్తులు పెట్టుకోవాల్సిందే అని టీడీపీ, జనసేన నేతలు బలంగా నమ్ముతున్నారు. కాబట్టి ఇప్పుడు కామ్ గా ఉన్నా ఎన్నికల సమయంలో కచ్చితంగా రెండుపార్టీలు కలుస్తాయని చాలామంది అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలోనే తిరుపతిలో పవన్ మాట్లాడుతు టీడీపీ కొమ్ముకాయనని ప్రకటించారు. పైగా వైసీపీ, టీడీపీకి ప్రత్యామ్నాయం కావాలని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.  టీడీపీతో పొత్తుకు సంబంధించి జనవాణిలో పవన్ తన వైఖరిని స్పష్టంగా చెప్పేసినట్లఅయ్యింది.ఇక్కడ విషయం ఏమిటంటే జనసేన-టీడీపీ కలిసి పోటీచేయాలని చంద్రబాబుతో పాటు ఎల్లోమీడియాకు చాలా బలమైన కోరికుంది. అయితే రెండుపార్టీల్లోని కొందరు నేతలు మాత్రం పొత్తులను వ్యతిరేకిస్తున్నారు. ఏదేమైనా పవన్ ఇపుడు చేసిన ప్రకటనకే కట్టుబడుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలటం ఖాయం. అదే జరిగితే ఇటు పవనే కాదు అటు చంద్రబాబుకు కూడా పెద్ద దెబ్బపడుతుందనటంలో సందేహంలేదు. ఒకవైపు రెండుపార్టీలు కలిసి పనిచేస్తే తాము గెలుచుకుబోయే సీట్ల సంఖ్యపై టీడీపీలో కొందరు నేతలు లెక్కలేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకు పవన్ ప్రకటనతో ఫ్యూజులు ఎగిరిపోవటం ఖాయమే.
మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: