యాదాద్రి ఆలయంలో.. రికార్డు స్థాయి ఆదాయం.. ఎంతో తెలుసా?

praveen
ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ లో తిరుపతి లాంటి ప్రఖ్యాతి కలిగిన ఆలయం లేకుండా పోయింది. ఇలాంటి సమయం లోనే నల్గొండ జిల్లాలో ఉన్న యాదాద్రి ఆలయాన్ని తెలంగాణ తిరుపతిగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమం లోనే ఆలయ రూపు రేఖలు అన్నింటినీ మార్చేసి సర్వాంగ సుందరం గా ఆలయాన్ని తీర్చిదిద్దింది తెలంగాణ ప్రభుత్వం.

 ఇక ప్రస్తుతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి ఈ క్రమం లోనే యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ప్రస్తుతం ఆలయానికి పోటెత్తుతున్నారు అని చెప్పాలి. మొన్నటి వరకు కరోనా వైరస్ కారణం గా యాదాద్రి వెళ్లకుండా ఉండి పోయిన వారు కొంత మంది అయితే కొత్త ఆలయానికి చూసేందుకు ఇక లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునేందుకు వెళుతున్న వారు మరికొంత మంది. ఇలా భారీగా యాదాద్రి ఆలయానికి భక్తులు తరలి వస్తున్న నేపథ్యం లో ఆలయం మొత్తం ప్రతి రోజు భక్తుల తో కిటకిటలాడుతోంది అనే చెప్పాలి.

 ఇకపోతే ఇటీవల భక్తుల తాకిడి ఎక్కువ కావడం తో యాదాద్రి ఆలయానికి మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయి లో ఆదాయం వచ్చింది. వివిధ పూజల ద్వారా 50.89 లక్షలు ఆదాయం రాగా.. ఇక ప్రసాద విక్రయం ద్వారా 18.27 లక్షల రూపాయలు ఆదాయం వచ్చింది. విఐపి దర్శనం ద్వారా 6.90 లక్షల ఆదాయం రాగా.. ప్రధాన బుకింగ్ ద్వారా  4.7 లక్షల ఆదాయం వచ్చింది. ఇక సుమారు 40వేల మందికి పైగా భక్తులు లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్నారు అన్నది తెలుస్తుంది. ఇక భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడం తో ధర్మ దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టింది అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: