వైసీపీకి వ్యతిరేకంగా నటుడు పృథ్వి టీడీపీ నుండి పోటీ?

VAMSI
సినిమా రంగంలో ఉండే వ్యక్తులు రాజకీయ నాయకులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏదో ఒక సంబంధాన్ని కలిగి ఉంటారు. పలువురు రాజకీయ నాయకులు తెరచాటు నిర్మాతలు మారి బినామీలను పెట్టుకుని సినిమాలు నిర్మిస్తున్నారు. అయితే సినిమా రంగంలోని కొందరు వ్యక్తులు ఏపీలో కొత్తగా పార్టీ పెట్టిన నాయకుడు జగన్ కు మద్దతు ఇచ్చారు. అలంటి వారిలో ముఖ్యంగా కమెడియన్ అలీ, పోసాని కృష్ణమురళి మరియు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ రాజు 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేసి వైసీపీ కొన్నిచోట్ల విజయాన్ని సాధించడంతో కీలక పాత్ర పోషించారు. తర్వాత వైసీపీ చరిత్రలో గుర్తిండిపోయే ఫలితాన్ని సొంతం చేసుకుని జగన్ సీఎం అయ్యారు.
ఎన్నికల్లో తమకు సపోర్ట్ గా నిలిచిన వ్యక్తులకు ఏదో విధంగా సహాయం చేస్తూ వచ్చారు జగన్. అదే విధంగా పృథ్వి రాజ్ ను టీటీడీ పాలక మండలిలో భాగం అయిన ఎస్వీబీసీ ఛానల్ కు చైర్మన్ గా నియమించారు. అయితే తనకు దక్కిన అదృష్టాన్ని ఓర్వలేని కొందరు సొంత పార్టీ వారే వెనుక గోతులు తీయడం ఆరంభించారు. అలా వచ్చిందే... బూతులు మాట్లాడినట్లు ఉన్న ఆడియో కొంతకాలం క్రితం కలకలం రేపింది. అయితే ఈ విషయంలో వైసీపీ సపోర్ట్ చేయకపోగా నిజా నిజాలు తెలుసుకోకుండా ఇబ్బంది పెట్టిందని అప్పట్లో పృథ్వి మీడియా ద్వారా చెప్పారు. అయితే తన మీద నమ్మకం లేకపోవడంతో తన పదవికి రాజీనామా చేశారు.
వైసీపీ ఉందన్న నమ్మకంతో అప్పట్లో సినీ ప్రముఖుల మీద ఎన్నో వ్యాఖ్యలు చేసారు. అయితే ఈ సంఘటన తర్వాత మేల్కొలుపు వచ్చింది. ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా తన ప్రవర్తన ఉంది. మీడియా ముఖంగా కూడా ఎన్నో వ్యాఖ్యలు వైసీపీ కి వ్యతిరేకంగా చేస్తున్నారు. దీనిని బట్టి వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన ల నుండి ఏదో ఒక నియోజకవర్గం నుండి వైసీపీ కి వ్యతిరేకంగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: