ఉక్రెయిన్‌ సైనికులకు రష్యా డెత్ వార్నింగ్?

Chakravarthi Kalyan
లొంగిపోండి.. లేకుంటే చచ్చిపోతారు..ఇదీ రష్యా ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఉక్రెయిన్ సైనికులకు ఇస్తున్న చివరి అవకాశం. మరియుపోల్ వంటి ప్రాంతాలపై పూర్తి పట్టు సాధించిన రష్యా.. అక్కడి ఉక్రెయిన్ సైనికులకు ఈ ఆఫర్ ఇస్తోంది. ఇది ఆఫర్ అనుకోవాలో.. వార్నింగ్ అనుకోవాలో మీ ఇష్టం.. ఎందుకంటే.. రష్యా సైన్యంపై దాడికి దిగినా ప్రతిఘటించినా చావు తప్పదని రష్యా వార్నింగ్ ఇస్తోంది. ఇప్పిటికే చాలా ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ బలగాలను తరిమికొట్టామని రష్యా రక్షణ శాఖ చెప్పుకుంటోంది.

మరియుపోల్ లో ఇప్పటివరకు వెయ్యి మందికిపైగా సైనికులను చంపేశామని రష్యా సైన్యం చెబుతోంది. వీరిలో ఎక్కువ మంది ఉక్రెయిన్ సైనికులు కారని.. వారంతా ఇతర దేశాలు సమకూరుస్తున్న సైన్యం అని రష్యా ఆరోపిస్తోంది. తమ ధాటికి మరో వెయ్యి మంది సైనికులు ఇతర దేశాలకు పారిపోయారని రష్యా ప్రకటించింది. రష్యా ఊరికే ప్రకటన చేయడం కాకుండా.. రష్యా సైన్యం ఉక్రెయిన్ లో ఉందని చెప్పడానికి సాక్ష్యంగా ఓ వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఉక్రెయిన్ సైనిక స్థావరాలపై రష్యా హెలికాప్టర్ దాడి చేస్తున్న దృశ్యాలను రష్యా విడుదల చేసింది. కీలకమైన అజోవ్ స్థల్ ఉక్కు కర్మాగారంలో 400 మంది విదేశీ సైనికులు ఉన్నారని రష్యా అంటుోంది. వీరు ఉక్రెయిన్ కు చెందిన వారు కాదని.. అంతా యూరప్, కెనడా దేశస్తులను రష్యా ఆరోపిస్తోంది. వీరు తక్షణం లొంగిపోవాలని లేకుంటే అందరినీ చంపేస్తామని రష్యా వార్నింగ్ ఇచ్చింది.

ఇక ఈ అజోవ్‌ స్థల్ గురించి చెప్పుకోవాలంటే.. ఇది తూర్పుఉక్రెయిన్ లోని కీలకమైన భాగం.. రష్యా ఈ తూర్పు ప్రాంతాన్ని చేజిక్కించుకోవాలంటే ఈ అజోవ్ స్థల్‌ పై పట్టు బిగించాలి. అందుకే అజోవ్ స్థల్ ఉక్కుకర్మాగారంపై దాడి చేయాలని రష్యా  ప్లాన్ చేస్తోంది. మరి రష్యా హెచ్చరికను ఉక్రెయిన్‌ సైన్యం ముసుగులో ఉన్న ఇతర దేశాల సైనికులు పట్టించుకుంటారా?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: