గెలుపే కాదు.. కోహ్లీ ఓ అరుదైన రికార్డు?

praveen
ప్రపంచ క్రికెట్లో ఎంతోమంది స్టార్ ప్లేయర్లు ఉన్నారు. అయితే అందరిలో రికార్డుల రారాజు ఎవరు అంటే మాత్రం ఒకే ఒక పేరు వినిపిస్తూ ఉంటుంది. అదే టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గురించి. అందరిలాగానే అతను కూడా ఒక సాదాసీదా క్రికెటర్ గా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. కానీ తన ఆట తీరుతో అతి తక్కువ సమయంలో తాను ఒక లెజెండ్ అన్న విషయాన్ని నిరూపించుకున్నాడు. ఇక ఇప్పుడు నేటి జనరేషన్ కి తనను మించిన లెజెండ్ మరొకరు లేరు అన్న విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చేశాడు. ఇప్పటివరకు ఎంతోమంది దిగ్గజ ఆటగాళ్లు కెరియర్ కాలం మొత్తంలో సాధించిన రికార్డులను కోహ్లీ అతి తక్కువ సమయంలోనే బద్దలు కొట్టాడు.

 ఇక రికార్డుల విషయంలో నేటితరం క్రికెటర్లకు ఎవరికి అందనంత దూరంలో కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఎన్ని రికార్డులు సాధించినప్పటికీ ఇంకా కోహ్లీలో ఇంకా ఏదో సాధించాలి అనే కసి మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ కూడా జట్టులోకి కొత్తగా వచ్చిన ఆటగాడిలాగా ఎప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన చేసి ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కోహ్లీ. ఇక రికార్డుల వేట కొనసాగిస్తూనే ఉన్నాడు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఇప్పటికే ఎన్నో రికార్డులు కొట్టిన కోహ్లీ సన్రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో మరో రికార్డు అందుకున్నాడు.

 ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో 10 సీజన్స్ లో 400కు పైగా పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఐపీఎల్ 2024 ముందు వరకు 9 ఐపీఎల్ సీజన్స్ లో కోహ్లీ 400 పరుగులు చేయగా.. ఇక ఇటీవల సన్రైజర్స్ తో మ్యాచ్లో ఈ ఏడాది సీజన్ లో కూడా 400 పరుగుల మార్కులు అందుకున్నాడు. దీంతో అరుదైన రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా గత కొన్ని సీజన్స్ నుంచి ఓపెనర్ గా బరిలోకి దిగుతున్న కోహ్లీ 4000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు అని చెప్పాలి. ఇకపోతే సన్రైజర్స్ తో ఉత్కంఠ భరితంగా  జరిగిన ఈ పొరులో ఆర్సిబి విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: