గంజాయికి బానిసైన కొడుకు... ఆ తల్లి ఎలా బుద్ది చెప్పిందో మీరే చూడండి?

VAMSI
ఈ ఫాస్ట్ జనరేషన్ లో చాలా మార్పులే వచ్చాయి. మార్పు మంచిదే.. అభివృద్ధి సాధ్యం అవుతుంది. అయితే మార్పు మంచికి జరగాలి కానీ వినాశనానికి కాదు. ఈ మధ్య కాలంలో యువత చెడు అలవాట్లకు బాగా అలవాటు పడుతున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా... గంజాయి, డ్రగ్స్ ఇలా మత్తు పదార్థాలకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరు తమ తల్లితండ్రులకు తెలియకుండా జాగ్రత్త పడుతూ  వ్యవహారాలు నడుపుతుంటే మరి కొందరు తమ పెద్ద వాళ్ళకి తెలిసినా కూడా లెక్క చేయకుండా తమ దారి తమదే అంటున్నారు. అయితే ఇదే వైఖరితో నచ్చినట్లు చేస్తూ తిరుగుతున్న ఓ యువకుడికి సరైన బుద్ది చెప్పింది ఆ తల్లి.
చేయి కాలితే పర్వాలేదు కానీ శరీరం మొత్తం కాలకుండా జాగ్రత్త పడాలన్న తరహాలో ఆలోచించిన ఆ తల్లి తనయుడికి తగిన గుణపాఠం చెప్పింది. గంజాయికి అలవాటు పడ్డ ఆ యువకుడిని దారిలో పెట్టుకోడానికి ఆ తల్లి ఏమి చేసింది అంటే....సూర్య పేట జిల్లా కోదాడ కు చెందిన 15 ఏళ్ల కుర్రాడు గంజాయి కి పూర్తిగా బానిసయ్యాడు.  తల్లితండ్రులకు సైతం ఆ విషయం తెలిసింది. ఈ క్రమంలో వారు ఎంత చెప్పినా ఆ యువకుడు వినిపించుకోలేదు, గంజాయి మానాలని ఒత్తిడి చేసినా పట్టించుకోకుండా తరచూ గంజాయి వినియోగిస్తూ ఉండటంతో అతడి తల్లి కఠిన నిర్ణయం తీసుకుంది.
తన కొడుకుని స్థంభానికి కట్టేసి మరి కంట్లో కారం కొట్టింది. చెప్పు గంజాయి పూర్తిగా మానేస్తావా లేక రోజూ ఇదే పూజ చేయమంటావా అంటూ కారం కొట్టింది. దెబ్బకు దెయ్యం దిగింది ఆ కుర్రాడు లేదమ్మా ఇంకా నిజంగా చేయను ఒట్టు అంటూ బ్రతిమలాడాడు. అయితే ఇంకెప్పుడైనా గంజాయి ముట్టినట్లు తెలిస్తే సీన్ రివర్స్ అవుతుందని కొడుక్కి గట్టిగా బుద్ధి చెప్పింది ఆ తల్లి. మనసుకు కష్టం గా అనిపించినా కొడుకును మందలించడానికి అన్ని ప్రయత్నాలు చేసి ప్రయోజనం లేకపోవడంతో ఇలా చేయడానికి పూనుకుంది. అంతే కాకుండా ఇలా గంజాయి మత్తు పదార్దాల బారిన పడి ఎందరో యువకులు నాశనం చేసుకుంటున్నారు, ఎలాగైనా ఇలాంటి వారిని కాపాడి, గంజాయి రవాణాను అరికట్టాలి అంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: