వివేకా హత్య: సీబీఐ సంచలన కామెంట్స్?

Chakravarthi Kalyan
ఏపీలో కలకలం సృష్టిస్తున్న వివేకా హత్యకేసు దర్యాప్తులో తాజాగా సీబీఐ సంచలన ఆరోపణలు చేసింది. ఈ కేసు ఇప్పటికే ఓ కొలిక్కి వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ కేసులో మెజిస్ట్రేట్‌ ముందు సాక్ష్యం చెప్పేందుకు సిద్ధమైన కొందరు ప్రలోభాలు, బెదిరింపులకు లొంగిపోయారని సీబీఐ వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. ఈ కేసు దర్యాప్తులో సీఐ శంకరయ్య, గంగాధర్‌ రెడ్డి, కృష్ణారెడ్డి వంటి వారు ప్రలోభాలు, బెదిరింపులకు లొంగుతున్నారని సీబీఐ కోర్టుకు తెలిపింది. వీరంతా ఎవరికో  భయపడి వెనక్కి తగ్గారని హైకోర్టుకు సీబీఐ సమాచారం ఇచ్చింది.

ఈ కేసు విచారణలో సాక్ష్యం చెప్పేందుకు సిద్ధమై.. ఆ తర్వాత వెనక్కి తగ్గిన అప్పటి సీఐ శంకరయ్యకు ప్రభుత్వం నుంచి మంచి పోస్టింగ్‌ దక్కిందని సీబీఐ కోర్టుకు చెప్పడం విశేషం. ప్రస్తుతం గంగిరెడ్డి కాకుండా మిగిలిన నిందితులంతా జ్యుడిషియల్‌ కస్టడీలోనే ఉన్నారని సీబీఐ కోర్టుకు వివరించింది. గంగిరెడ్డికి పులివెందుల కోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కూడా  హైకోర్టుకు సీబీఐ విజ్ఞప్తి చేసింది. ఈ కేసులో ప్రధాన సాక్షులుగా ఉన్న వాచ్‌మెన్‌ రంగన్నతో పాటు అప్రూవర్‌గా మారిన డ్రైవర్‌ దస్తగిరి ప్రాణాలకు ముప్పు ఉందంటోంది సీబీఐ. అందుకే వీరికి జైలులో తగిన భద్రత కల్పించాలని కడప కోర్టులో సీబీఐ పిటిషన్‌ కూడా వేసింది.

తాజాగా గంగిరెడ్డి కారణంగా సాక్షులకు భద్రత కరువవుతుందని సీబీఐ హైకోర్టులోఆందోళన వ్యక్తం చేసింది కూడా. మరోవైపు  ఈ కేసు విచారణ కీలక దశకు చేరుకుందని.. త్వరగా పెద్ద తలకాయల అరెస్టులు కూడా తప్పవని మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. త్వరలో కడప జిల్లాకు చెందిన ఓ ప్రముఖ నేతను అరెస్టు చేస్తారని కూడా ఊహాగానాలు విస్తృతంగా వస్తున్నాయి. తాజాగా ఈ హత్య కేసుపై వైఎస్ వివేకా హత్యపై ఆయన చెల్లెలు విమలారెడ్డి కూడా స్పందించిన సంగతి తెలిసిందే.

 
వివేకా చెల్లెలు విమలారెడ్డి.. ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. ఈ కేసులో రాజకీయ ప్రమేయం ఉందనేది స్పష్టంగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. వివేకాను చంపిన నిందితులు కూడా తమ నేరాన్ని అంగీకరించిన తరువాత ఇంకా కేసు ఎందుకు కొనసాగిస్తున్నారని విమలా రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎవరినో ఇరికించాలనే ఉద్దేశంతోనే కేసును కొనసాగిస్తున్నట్లు తాను అనుకుంటున్నానని ఆమె ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: