కరుడుగట్టిన కాంగ్రెస్ నేతలు.. కమలం గూటికి వెళ్ళనున్నారా..!

MOHAN BABU
కాంగ్రెస్ పార్టీ అంటేనే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది కోమటిరెడ్డి బ్రదర్స్.. తరచూ ఏదో ఒక విషయంలో సంచలనంగా మారుతుంటారు. వారి సుదీర్ఘ రాజకీయం అనేది కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తోంది. కానీ గత కొద్ది రోజుల నుంచి వారికి రేవంత్ రెడ్డి మధ్య విభేదాల కారణంగా పలు విధాలుగా పార్టీపై విమర్శలు చేస్తూనే వస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో వారు పార్టీ మార్పు పై ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. ఒకవేళ మారితే బిజెపిలోకి వెళ్తారు అనే విధంగా ఆలోచించాల్సి వస్తోంది. దీనిపై రాజకీయ విశ్లేషకులు నిజమేనని అంటున్నారు.

 మొన్న తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి నాయకుడు వివేక్ వెంకటస్వామితో భేటీ అయితే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం  నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఇప్పుడు నల్గొండ జిల్లాకు చెందిన ఈ యొక్క కీలక నేతలు వీలు చిక్కినప్పుడల్లా బిజెపి వంత పాడుతూ కాంగ్రెస్ పార్టీ  వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డి బ్రదర్స్ కు కాంగ్రెస్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా నకిరేకల్, నల్గొండ, మునుగోడు, భువనగిరి, ఆలేరు, ఇబ్రహీంపట్నం, జనగామ, జిల్లాలో వీళ్ల హవా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యవహరిస్తున్న తీరు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కన్ఫ్యూజన్ లో పడేసింది. ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  చాలాసార్లు తాను బిజెపి పార్టీలో చేరనున్నట్లు బహిరంగంగానే ప్రకటించారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేగా రాజీనామా చేసి సాగర్ ఉప ఎన్నికల్లో బిజెపి తరఫున పోటీ చేస్తారని ప్రచారం కూడా జరిగింది. తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ముందురోజే బీజేపీ నేత వివేకుతో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి భేటీ కావడం, తర్వాత ఎంపీ వెంకటరెడ్డి ప్రధాని మోడీతో కలవడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలహీనపడుతుందని వెంకట్ రెడ్డి సైతం బిజెపి తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నట్లు తెలిసింది.

 అందులో భాగంగానే మోడీని కలిసినట్లు ప్రచారం సాగుతోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాని అపాయింట్మెంట్ కోరిన  అర్థ గంటల్లోనే కన్ఫామ్ చేశారని సమాచారం. గతంలో సీఎం కేసీఆర్ తెలంగాణ మంత్రులు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ కోసం రోజుల తరబడి ఎదురు చూసిన దొరకకపోవడం గమనార్హం. వెంకట్ రెడ్డికి ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వడం, తెలంగాణ రాజకీయ పరిస్థితులపై చర్చించడం చాలా చర్చనీయాంశంగా మారాయి. దీన్ని బట్టి చూస్తే మాత్రం త్వరలోనే కోమటిరెడ్డి బ్రదర్స్ బిజెపి తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జోరుగా కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: