పాలకవర్గ కొలువులకు ఊహించని బ్రేక్...!

Podili Ravindranath
జరక్క జరక్క ఎన్నికలు జరిగాయి.. జరిగిన ఎన్నికలకు సంబంధించి సంపూర్ణ ఫలితం మాత్రం మళ్ళీ అటకెక్కినట్లు అయ్యింది. చారిత్రక కొండపల్లి మున్సిపాలిటీ పాలకవర్గ పగ్గాలు ఎవరికి దక్కుతాయి అన్న అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల హై డ్రామా తరువాత ఎన్నికల నిర్వహణ అధికారులు ఊహించని షాక్ తగిలించారు. కొండపల్లి మున్సిపాలిటీ  పాలకవర్గ ఎన్నిక ప్రక్రియ నిరవధిక వాయిదా వేస్తూ ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. శాంతి భద్రతల పరిరక్షణ నేపథ్యంలో కొండపల్లి మున్సిపాలిటీ పాలకవర్గం ఏర్పాటు సాధ్యం కాదని తేల్చి చెప్పింది.  ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో అభ్యంతరాలు వెల్లువెత్తడంతో గత రెండు రోజులు గా ప్రమాణ స్వీకారం నిర్వహణ సాధ్యపడలేదు. దీంతో  కొండపల్లి మొట్ట మొదటి పాలకవర్గ ఎన్నిక గందరగోళానికి దారితీసింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన కొండపల్లి పుర పోరులో ఏపార్టికి స్పష్టమైన సీట్లు రాకపోవడం తో గెలుపొందిన కౌన్సిలర్లలో అయోమయం నెలకొంది.. గెలిచి కౌన్సిల్ లో తమ గళం వినిపించాలని ఆశ పడిన కౌన్సిలర్ల కు జరుగుతున్న నాటకీయ పరిణామాలు అసంతృప్తి తో రగిలిపోతున్న దుస్థితి దాపురించింది. ప్రస్తుతం కొండపల్లి మున్సిపాలిటీ పాలకవర్గం ఎన్నిక నిరవదిక వాయిదా వేయడంతో ఆయ పార్టీల నేతలు భవిష్యత్ కార్యాచరణ పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఎన్నికను నిరవధికంగా వాయిదా వేయిన ఎన్నికల అధికారి సునీల్ కుమార్ రెడ్డి.... కొండపల్లి మున్సిపల్ కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయారు. అయితే తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు, ఇతర సభ్యులు మాత్రం కార్యాలయం లోపలే ఉన్నారు. ఎన్నికకు అవకాశం లేకుండా పోయిందని అధికారి శివన్నారాయణ రెడ్డి తెలిపారు. తాము ఎంతగా సర్ది చెప్పినా కూడా సభ్యులు వెనక్కి తగ్గలేదన్నారు. ప్రస్తుతం కొండపల్లి కౌన్సిల్ ఎన్నికకు అవకాశం లేకుండా పోయిందన్నారు అధికారి. అందుకే ఎన్నికను వాయిదా వేసినట్లు శివన్నారాయణ రెడ్డి వెల్లడించారు. టీడీపీ సభ్యులు కార్యాలయం లోపలే ఉన్నారు కదా ప్రశ్నిస్తే మాత్రం... ఏ మాత్రం సమాధానం చెప్పకుండా ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. శాంతి భద్రతల దృష్ట్యా పాలక వర్గం ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: