రచ్చకేక్కిన ఆదిలాబాద్ ఎమ్మెల్సీ.. సార్ మనసులో ఎవరున్నారో..!

MOHAN BABU
ఆదిలాబాద్ ఎమ్మెల్సి పీటం ఎవరికి దక్కనుంది? అధినేత కేసీఆర్ ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది? స్థానిక సంస్థల ఎన్నికల వేళ జిల్లాలో ఎవరికీ ఛాన్స్ రానుంది అన్నదే హాట్ టాపిక్ గా మారింది. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో జిల్లా లో ఎవరెవరికి అవకాశం  దక్కుతుందన్న దానిపై ఆసక్తి కరమైన చర్చ సాగుతోంది. అన్ని జిల్లాల్లోనూ మెజారిటీ స్థానిక సంస్థల ఓటర్లు టిఆర్ఎస్ కు చెందిన వారే కావడంతో ఆ పార్టీ అభ్యర్థులు గెలవడం లాంఛనప్రాయమే అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధినేత కేసీఆర్ ఎవరి పై కరుణ చూపుతా రన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సి గా ఎవరికీ అవకాశం ఇవ్వనుందన్నది ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 నియోజకవర్గాలకు చెందిన సభ్యులు ఎన్నుకునే ఎమ్మెల్సీ బలాబలాలను పరిగణలోకి తీసుకుంటే అధికార టీఆర్ఎస్ కే ఈ స్థానం దక్కనుంది. కాగా ఇక్కడినుంచి ఎమ్మెల్సీ అభ్యర్థి త్వాన్ని ఆశిస్తున్న ఆశావహుల సంఖ్య భారీగా పెరు గుతూ పోతుండడంతో అధినేత ఎవరిని ఎంపిక చేయను న్నారన్నదానిపై ప్రస్తుతం టీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.

 అయితే ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి పురాణం సతీష్ కుమార్ తో పాటు సీనియర్ నేతలు వేణుగోపాల చారి, సత్యనారాయణ గౌడ్, శ్రీహరి రావు, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి, లోక భూమారెడ్డి, మాజీ ఎంపీ నగేష్, రేణికుంట్ల ప్రవీణ్ ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇక వీరిలో వేణుగోపాలచారి ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ అవకాశం కోసం ఎప్పటి నుంచో  తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు రకరకాల సమీకరణాలతో అవకాశం దక్కడం లేదు. మరో నేత సత్యనారాయణ గౌడ్ కు కేసీఆర్ తో టిడిపి నుంచే అనుబంధం ఉంది. బీసీలకు అవకాశం ఇవ్వాలనుకుంటే తనకు దక్కుతుందని సత్య నారాయణ భావిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల  ఖరారు కొలిక్కిరావడంతో నేడు రేపు స్థానిక అభ్యర్థుల జాబితాను ఖరారు చేయనున్నారన్న వార్తల నేపథ్యంలో పదవిని ఆశిస్తున్న అభ్యర్థుల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ప్రస్తుత పోటీలో ఉన్న అభ్యర్థుల్లో కొత్త వారికి అవకాశం ఇస్తే పార్టీలో తలెత్తే పరిణామాలపై పార్టీ అధిష్టానం ఇప్పటికే ఒక అంచనాకు వచ్చిందని సమాచారం. హుజురాబాద్ ఫలితం నేపథ్యంలో  అభ్యర్థులను ఎంపిక చేయాలనుకుంటే మాత్రం సిట్టింగ్స్ కి మరోసారి అవకాశం కల్పించవచ్చని పార్టీ పరిశీలకులు భావిస్తున్నారు. దీంతో ఆశావాహులు ఏమాత్రం తీసిపోకుండా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి కేసీఆర్ మదిలో ఎవరున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: